ఏపీ భవన్ లో దీక్ష చేయబోతున్న ఓటుకు నోటు కేసు నిందితుడు  

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించడంతో పాటు … ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అకస్మాత్తుగా అమరావతి కి ప్రభుత్వ వ్యవహారాలన్నీ మార్చేయడానికి కారణం అయిన ఓటుకు నోటు కేసు ఇంకా వార్తల్లో నిలుస్తూ… సంచలనం సృష్టిస్తోంది. తాజాగా… ఈ కేసు నిందితుడు జెరూసలేం ముత్తయ్య ఈ నెల 11 వ తేదీన తనకు న్యాయం చేయాలంటూ… ఏపీ భవన్ లో నిరసన దీక్ష చేయబోతున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు.

Vote For Note Case Accused Muttayya Inmates On Ap Bhavan-

Vote For Note Case Accused Muttayya Inmates On Ap Bhavan

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఓటుకు నోటు కేసులో తనకు అన్యాయం జరిగిందనీ… ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారనీ వాపోయారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తనను ప్రలోభాలకు గురి చేస్తే ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కేసులో తెలంగాణ సర్కార్ తన పేరు చేర్చడాన్ని ఖండించారు. హైకోర్టు ఈ కేసులో తాను నిర్దోషినని చెప్పిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు.