నాట్స్ ఆధ్వర్యంలో ఫ్లోరిడా, టెంపాబే లో వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు

అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .ఈ సారి తమిళ స్నేహమ్స్ ఆర్ధ్వర్యం లో అంకుల్ జే జ్ఞాపకార్థకంగా నాట్స్.

 Volleyball And Throw Ball Tournaments In Florida, Tempe, Under The Auspices Of T-TeluguStop.com

ప్లోరిడాలో పురుషుల వాలీబాల్, మహిళల త్రోబాల్ టోర్నమెంట్లు నిర్వహించింది.రూరి స్టాప్ట్‌వేర్ టెక్నాలజీస్, ఐటీ సర్వీస్ అలయన్స్ ప్లోరిడా, సహకారంతో నాట్స్ టెంపాబే విభాగం ఈ టోర్నమెంట్‌కు తమ వంతు సహకారాన్ని, మద్దతును అందించాయి.

ఫ్లోరిడాలోని ఓర్లాండో, టాంపా బేలోని జాక్సన్ విల్లేకు చెందిన 22 జట్లు ఈ టోర్నమెంటుల్లో పాల్గొన్నాయి. 250 మందికి పైగా క్రీడాకారులు ఈ పురుషుల వాలీబాల్ మరియు ఉమెన్స్ త్రోబాల్ పోటీలో తమ క్రీడా ప్రతిభ ప్రదర్శించేందుకు పోటీ పడ్డారు.

వాలీబాల్ టోర్నమెంట్‌లో రచ్చ, టెంపాబే జట్టు పురుషుల వాలీబాల్ కప్ ను గెలుచుకుంది.

ఎంఎస్ కె, ఓర్లాండో జట్టు రన్నరప్‌గా నిలిచింది.

సన్ షైనర్స్, టెంపాబే జట్టు మహిళల త్రోబాల్ టోర్నమెంట్ విజేతగా నిలిచింది.ఎంఎ సిఎఫ్ వారియర్స్ ను రన్నరప్ గా నిలిచింది.టోర్నమెంట్ లో విజేతలకు ట్రోఫీలు, పతకాలు అందించారు.తమిళ స్నేహం ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ కార్యక్రమానికి నాట్స్ ఇచ్చిన మద్దతు మరువలేనిదని ప్రశంసించింది రూరిసాఫ్ట్, ఐటిసర్వ్ అలయన్స్ ఇతర స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలిపింది.

Telugu Florida, Macf Warriors, Orlando, Tampa Bay, Tempe, Throw, Nats, Volleybal

ఈ టోర్నమెంట్స్ విజయవంతం  కావడానికి నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ నాట్స్ బోర్డు కార్యదర్శి ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్/మార్కెటింగ్) శ్రీనివాస్ మల్లాది, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ కాండ్రు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, నాట్స్ టెంపాబే చాప్టర్ కో ఆర్డినేటర్, ఐటిసర్వ్ అలయన్స్ టెక్నాలజీ చైర్ ప్రసాద్ ఆరికట్ల, ఐటిసర్వ్ అలయన్స్, ఫ్లోరిడా చాప్టర్ ప్రెసిడెంట్ భరత్ మూల్పూరు, జాయింట్ కో ఆర్డినేటర్ సురేష్ బొజ్జా తదితరులు కీలక పాత్ర పోషించారు.తమిళ స్నేహం ఎగ్జిక్యూటివ్ కమిటీ దేవా అన్బు ఈ టోర్నమెంట్‌కు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.నాట్స్ టెంపాబే సహకారంతో జరిగిన ఈ టోర్నమెంట్లకు మద్దతు అందించిన నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే, నాట్స్ నాయకులు రవి గుమ్మడిపూడి, శ్రీనివాస్ కాకుమాను,రంజిత్ చాగంటి, మురళీ మేడిచెర్ల తదితరులకు నాట్స్ టెంపా బే విభాగం కృతజ్ఞతలు తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube