వాట్సప్‌లో కొత్త ఫీచర్‌... దీంతో వాట్సప్‌ వాడటం మరింత సులభం, సుఖం.. తప్పకుండా తెలుసుకోండి     2019-01-17   13:43:02  IST  Ramesh Palla

వాట్సప్‌ ప్రతి రోజు జీవితంలో భాగస్వామ్యం అయ్యింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌, ఆ ఫోన్‌ లో వాట్సప్‌ అనేది చాలా కామన్‌ అయ్యింది. వాట్సప్‌ పెద్ద ఎత్తున వినియోగిస్తున్న నేపథ్యంలో ఎన్నో మార్పులు చేర్పులు చేస్తూ తీసుకు వస్తున్నారు. వాట్సప్‌ రెండు సంవత్సరాల క్రితంకు ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. అద్బుతమైన ఫీచర్స్‌తో వాట్సప్‌ అత్యంత ప్రజారంజకంగా వినియోగదారులకు సేవలు అందిస్తుంది. ఈ నేపథ్యంలో వాట్సప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకు వచ్చింది.

Voice To Text In Whatsapp-Telugu Tech News Viral About Whatsap Whatsapp

Voice To Text In Whatsapp

వాట్సప్‌లో ఇప్పటికే వాయిస్‌ మెసేజ్‌ ఉన్న విషయం తెల్సిందే. అయితే ఇప్పుడు వాట్సప్‌ లో కొత్త ఫీచర్‌ వచ్చింది. అదేంటి అంటే మనం ఏదైతే మాట్లాడుతామో అది టెక్ట్స్‌ రూపంలో మారుతుంది. అలా టెక్ట్స్‌ రూపంలో మారి, సాదారణ టెక్ట్‌ మెసేజ్‌ మాదిరిగానే అవతలి వారికి వెళ్తుంది. అంటే ఇకపై వేల్లు పోయేలా మెసేజ్‌ లు టైప్‌ చేయాల్సిన పని లేదు. కేవలం వాయిస్‌తో కమాండ్‌ చేస్తే మాత్రం టెక్ట్స్‌ దానంతట అదే టైప్‌ అవుతుంది.

Voice To Text In Whatsapp-Telugu Tech News Viral About Whatsap Whatsapp

వాట్సప్‌లో కొత్తగా వచ్చిన ఈ ఫీచర్‌ను థర్డ్‌ పార్టీ వారు అందిస్తున్నారు. ఈ థర్డ్‌ పార్టీ యాప్‌ను వాట్సప్‌ తాజాగా తీసుకు వచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులోకి రాబోతుంది. ప్రస్తుతం ఇది బీటా వర్షన్‌లో మాత్రమే కొనసాగుతుంది. త్వరలోనే కొత్త వర్షన్‌ వాట్సప్‌ను విడుదల చేస్తారని, అందులో ఈ వాయిస్‌ టెక్ట్స్‌ కన్వర్ట్‌ రాబోతుందని చెబుతున్నారు. ఇప్పటికే వాట్సప్‌ అత్యంత ఆకట్టుకునే సేవలను అందిస్తుంది. ఈ క్రమంలో మరింతగా వాట్సప్‌ వినియోగదారులకు హెల్ప్‌ అయ్యేలా ఈ ఫీచర్‌తో రాబోతుంది. అయితే ఈ ఫీచర్‌ తెలుగు సేవలను అందించబోతుందో చూడాలి.