కాంగ్రెస్ లో వినిపించని సీనియర్ ల వాయిస్... అసంతృప్తి యే కారణమా?

దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం ఎంతో గొప్పది.అయితే మిగతా పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ.

 Voice Of Seniors Not Heard In Congress ... What Is The Cause Of Dissatisfaction-TeluguStop.com

అందుకే ఒకరి మాట మీద వ్యవస్థ నడిచే పరిస్థితి ఉండదు.అందుకే బహిరంగంగానే పార్టీ ఆదేశాలను ధిక్కరించిన పరిస్థితులను మనం చూశాం.

అందుకే కాంగ్రెస్ లో కొన్ని కొన్ని సార్లు విప్ లు జారీ చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి.ఇక తెలంగాణ కాంగ్రెస్ విషయానికొస్తే తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంగా ఎదగడానికి వచ్చిన ఎన్నో అవకాశాలను వదులుకుంది.

అందుకే తెలంగాణ ఇచ్చినా కూడా ఆ క్రెడిట్ ని సంపాదించుకోలేకపోయింది.అయితే ముఖ్యంగా ఇక కాంగ్రెస్  లో పార్టీని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలనే ఆలోచన చాలా తక్కువ ఉండటం, గ్రూపు రాజకీయాలు, వ్యక్తిగత ఎజెండాలు ఉండడం వలన ఎవరైతే ముందుకొచ్చి పార్టీ అభివృద్ధి కాంక్షించి పోరాడుతారో వారి మీదే భారం పడుతుంది.

ప్రస్తుతం రేవంత్ పరిస్థితి ఇలాగే ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పుడు రేవంత్ కూడా ఒంటరిగా పోరాడుతున్న పరిస్థితి.రేవంత్ ను పీసీసీ చీఫ్ ను చేయడం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ లకు పెద్దగా నచ్చలేదు.అందుకే చాలా రోజుల వరకు పీసీసీ చీఫ్ ప్రకటనను చాలా రోజులు వాయిదా వేయించారు.

ఇక చివరికి అధిష్టానం ప్రకటన చేయాలని డిసైడ్ అవడంతో అందరూ తప్పక అంగీకరించాల్సి వచ్చింది.సీనియర్ లు అసంతృప్తిగా ఉన్నారని తెలిసి మొదట్లో అందరి సీనియర్ లను స్వయంగా ఇంటింటికీ వెళ్ళి కలవడం జరిగింది.

అయితే మరల ఇప్పుడు అదే పరిస్థితి ఉంది.రేవంత్ కు మరల సీనియర్ లు సహకరించని పరిస్థితి ఉంది.

మరి రేవంత్ మరల సహకరించని సీనియర్ ల పేర్లను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారా అన్నది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube