చిరంజీవి కూతురి పెళ్లిలో అలా జరగడంతో ఆశ్చర్యపోయా.. దర్శకుని కామెంట్స్ వైరల్!

ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.వీఎన్ ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలతో ఎక్కువ సినిమాలు విజయం సాధించాయి.

 Vn Aditya Comments Goes Viral About Chiranjeevi Daughter Marriage Details, Direc-TeluguStop.com

వీఎన్ ఆదిత్య ఇంటర్వ్యూలో మట్లాడుతూ మాయ మాటలు చెప్పి బెనిఫిట్ పొందే అవకాశాలు ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటాయని అన్నారు.నా ప్రొఫైల్ కు అలా చేయడం మరింత ఈజీ అని ఆయన కామెంట్లు చేశారు.

ఆ సమయంలో నేను ఇబ్బందులు పడ్డానే తప్ప ఎవరికీ అబద్ధం చెప్పలేదని వీఎన్ ఆదిత్య అన్నారు.అప్పట్లో 100 డేస్ ఫంక్షన్లకు సినిమా వాళ్లు వచ్చేవారని ఆయన తెలిపారు.

రావికొండలరావు గారిని కలిసి ఆయన సూచనల ప్రకారం అప్రెంటీస్ గా జాయిన్ అయ్యానని వీఎన్ ఆదిత్య తెలిపారు.ఆ తర్వాత స్క్రిప్ట్ అసిస్టెంట్ గా కూడా చేశానని త్వరగానే తనకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చిందని వీఎన్ ఆదిత్య చెప్పుకొచ్చారు.

తాను మంచి డైరెక్టర్ల దగ్గర పని చేశానని వీఎన్ ఆదిత్య వెల్లడించారు.

సంగీతం శ్రీనివాసరావు చాలా విషయాలను నేర్పించారని వీఎన్ ఆదిత్య తెలిపారు.చిరంజీవి గారి కూతురి పెళ్లికి తాను వెళ్లానని పి.వాసుగారు గట్టిగా హగ్ చేసుకుని తనను మెచ్చుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు.ఇలా కెరీర్ లో మంచి అనుభవాలు ఉన్నాయని వీఎన్ ఆదిత్య వెల్లడించారు.గురువుల నుంచే తాను చాలా విషయాలను నేర్చుకున్నానని వీఎన్ ఆదిత్య అన్నారు.

తాను రైటర్స్ తో ఎక్కువగా ట్రావెల్ చేశానని సత్యానంద్, పరచూరి బ్రదర్స్ తో కూడా తాను పని చేశానని వీఎన్ ఆదిత్య వెల్లడించారు.రైటర్స్ కు తాను ఎప్పుడూ రుణ పడి ఉంటానని వీఎన్ ఆదిత్య వెల్లడించారు.వీఎన్ ఆదిత్య చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వీఎన్ ఆదిత్యకు ప్రస్తుతం సినిమా ఆఫర్లు తక్కువగా ఉన్నాయనే సంగతి తెలిసిందే.

Director VN Adithya Remembers Incident in Chiranjeevi Daughter Marriage

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube