ఎదురులేని పుతిన్: 2036 వరకు రష్యా అధ్యక్షుడిగా ఆయనే, సంస్కరణలకు పార్లమెంట్ ఆమోదం  

Vladimir Putin Signs New Law Allowing Him To Run For Two More Terms - Telugu 383 Votes, Corona Effect On Russia, Craymlin, Russia, Russia Valdimir, Stalin In Russia, The State Duewma,, Voting On Internet

రష్యాను సుదీర్ఘకాలంగా పరిపాలిస్తున్న వ్లాదిమిర్ పుతిన్ తన అధికారానికి ఎదురు లేకుండా చేసుకున్నారు.నాలుగేళ్ల పదవీకాలం ఇంకా ఉండగానే, మరో 12 ఏళ్ల వరు అంటే 2036 వరకు తానే అధ్యక్షుడిగా ఉండేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.2024 తర్వాత మరో 12 ఏళ్లు తానే అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఉద్దేశిస్తూ రూపొందించిన రాజ్యాంగ సవరణలకు రష్యా పార్లమెంట్‌‌ ఆమోదముద్ర వేసింది.

 Vladimir Putin Signs New Law Allowing Him To Run For Two More Terms

ఈ మేరకు ‘‘ ద స్టేట్ డ్యూమా’’ రాజ్యాంగ సవరణలకు ఏకగ్రీవంగా ఆమోదం పలికింది.వీటికి అనుకూలంగా 383 ఓట్లు రాగా, వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడకపోవడం విశేషం.43 మంది పార్లమెంట్ సభ్యులు సమావేశానికి హాజరుకాలేదు.ద స్టేట్ డ్యూమా ఆమోదం పలికిన గంటల్లోనే పార్లమెంట్ ఎగువ సభ అయిన ఫెడరేషన్ కౌన్సిల్ కూడా ఈ సవరణలకు ఆమోదం పలికింది.ఈ సవరణలకు సంబంధించి ఏప్రిల్ 22న దేశవ్యాప్తంగా ఓటింగ్ జరగనున్నప్పటికీ అది కేవలం నామమాత్రమే.

ఈలోగా రష్యా రాజ్యాంగ న్యాయస్థానం వీటిని సమీక్షించనుంది.

ఎదురులేని పుతిన్: 2036 వరకు రష్యా అధ్యక్షుడిగా ఆయనే, సంస్కరణలకు పార్లమెంట్ ఆమోదం-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇంటర్నెట్ ద్వారా ఓటింగ్ జరిపేందుకు క్రెమ్లిన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.రాజ్యాంగ సంస్కరణలను వివరించే 68 పేజీల చట్టాన్ని క్రెమ్లిన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.రెండు దశాబ్ధాలుగా రష్యా రాజకీయాలను ఏలుతున్న పుతిన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

స్టాలిన్ తర్వాత రష్యాను అత్యధిక కాలం పాలించిన నేతగా పుతిన్ రికార్డుల్లోకి ఎక్కారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vladimir Putin Signs New Law Allowing Him To Run For Two More Terms Related Telugu News,Photos/Pics,Images..

footer-test