నోట్ల రద్దుతో పెరిగిన జయలలిత నెచ్చెలి శశికళ ఆస్తులు... గుట్టు విప్పిన ఐటీ

అవినీతి, అక్రమ సంపాదన కేసులో జయలలిత స్నేహితురాలు, ఆమె తరువాత జయలలిత స్థానంలోకి వచ్చి తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని కలలు కన్న శశికళ గుట్టు ఒక్కొక్కటిగా బయట పడుతుంది.జయలలితని అడ్డు పెట్టుకొని ఆమె వేల కోట్ల ఆదాయాన్ని అర్జించింది.

 Vk Sasikala Used Demonetised Currency To Buy Assets-TeluguStop.com

ఆమె మరణాంతరం అన్నా డిఏంకె పార్టీని హస్తగతం చేసుకోవాలని చూసిన ఆమెని అనూహ్యంగా ఓ కేసులో మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పి జైల్లో పెట్టింది.అప్పటి నుంచి జైలు జీవితానికి అంకితం అయిన శశికళ ఆదాయానికి సంబంధించి ఓ పిటీషన్ పై స్టే విధించారని రిట్ పిటీషన్ దాఖలు చేసింది.

దీనిపై కోర్టు ఐటీ అధికారులు ఆమె ఆదాయ వివరాలని కనుక్కోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపధ్యంలో ఆమె ఆదాయం, సంపాదన వివరాల మీద దృష్టిపెట్టిన ఐటీ అధికారులకి షాకింగ్ విషయాలు తెలియాయి.

వీటిని ఐటీ అధికారులు కోర్టు ముందు ఉంచారు.మోడీ ప్రవేశ పెట్టిన నోట్ల రద్దు సమయంలో శశికళ తాను సంపాదించిన అక్రమ సంపాదనతో ఆస్తులని కొనుగోలు చేసినట్లు తేలింది.

చెన్నై మధురై పెరంబూర్ లలో షాపింగ్ మాల్స్ ను కొనేసింది.చెన్నైలో ఒక షుగర్ మిల్, ఒక సాఫ్ట్ వేర్ కంపెనీని, పాండిచ్చేరిలో ఒక రిసార్ట్, కోయంబత్తూర్ లో పేపర్ మిల్ కొనుగోలు చేసింది.

అంతే కాకుండా కోయంబత్తూరులో 50 విండ్ పవర్ ప్లాంట్ లు కూడా కొనేసిందని తేలింది.ఈ ఆధారాలను కోర్టుకు సమర్పించిన అధికారుల మీడియాకి కూడా రివీల్ చేయడంతో ఒక్కసారిగా తమిళ జనాలు షాక్ అయ్యారు.

అమ్మని అడ్డుపెట్టుకొని చిన్నమ్మ ఇన్ని వేల కోట్ల అక్రమ ఆదాయం గడించిందా అని చెప్పుకుంటున్నారు.ఈ నిజాలతో శశికళని ఇన్ని రోజులు అభిమానించిన అమ్మ అభిమానులు అందరూ ఒక్కసారిగా ద్వేషించడం మొదలు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube