నా మూడో భార్య రమ్య గొప్ప మనిషి..వీకే నరేష్ అప్పట్లో అలా చెప్పారా?

సీనియర్ నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు.డైరెక్ట్ గా చెప్పకపోయినా పవిత్ర లోకేశ్ ను పెళ్లి చేసుకోవాలని నరేష్ భావిస్తున్నారనే సంగతి తెలిసిందే.

 Vk Naresh Shocking Comments About Ramya Raghupati Details, Ramya Raghupathi, Vk-TeluguStop.com

రమ్య రఘుపతిపై నరేష్ పలు సంచలన ఆరోపణలు చేయగా ఆ ఆరోపణల విషయంలో నరేష్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే గతంలో ఒక ప్రోగ్రామ్ లో రమ్య రఘుపతి గురించి నరేష్ గొప్పగా చెప్పుకొచ్చారు.

ఈ విషయంలో నరేష్ ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

అప్పట్లో రమ్య రఘుపతిని మెచ్చుకున్న నరేష్ ఇప్పుడు విమర్శలు చేయాల్సిన అవసరం ఏముందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.17 సంవత్సరాల వయస్సులో నేను నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టానని 19 సంవత్సరాల వయస్సులో పెళ్లి చేసుకున్నానని నరేష్ తెలిపారు.ఒక రకంగా నాకు 19 సంవత్సరాల వయస్సులో జరిగిన మ్యారేజ్ చైల్డ్ మ్యారేజ్ అని నరేష్ కామెంట్లు చేశారు.

నాకు మంచి జరగాలనే ఆలోచనతోనే పెద్దవాళ్లు పెళ్లి చేశారని అయితే అనారోగ్య సమస్యల వల్ల ఆమె విడిపోయిందని నరేష్ చెప్పుకొచ్చారు.

Telugu Naresh Fourth, Nareshpavitra, Nareshpraises, Naresh, Pavitra Lokesh, Ramy

రమ్య రఘుపతి నా థాట్స్ కు, భావజాలానికి తగిన వ్యక్తి అని నరేష్ కామెంట్లు చేశారు.కుటుంబంలో సర్దుకుపోయే మనస్తత్వం ఉన్న మనిషి రమ్య రఘుపతి అని నరేష్ చెప్పుకొచ్చారు.రమ్య రఘుపతి గ్రేట్ ఉమన్ అని నరేష్ వెల్లడించారు.

రమ్య రఘుపతి గురించి పాజిటివ్ గానే తప్ప నెగిటివ్ గా నరేష్ ఒక్క కామెంట్ కూడా చేయలేదు.

Telugu Naresh Fourth, Nareshpavitra, Nareshpraises, Naresh, Pavitra Lokesh, Ramy

అయితే కొన్నేళ్లలోనే నరేష్ కు రమ్యపై పూర్తిస్థాయిలో అభిప్రాయం మారిపోయింది.ప్రస్తుతం రమ్య రఘుపతి పరువుకు భంగం కలిగేలా నరేష్ ఎన్నో కామెంట్లు చేస్తున్నారు.రమ్య రఘుపతి, నరేష్ మీడియా ముందుకు రాకుండా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

ఈ వివాదం వల్ల పవిత్ర లోకేశ్ కు సైతం సినిమా ఆఫర్లు తగ్గుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube