అప్పుడప్పుడు కొన్ని వీడియోలు లేదా ఫొటోలు చూస్తే నిజంగానే షాక్ అవ్వాల్సిందే.ఎందుకంటే అవి ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి.
ఇక ఆడవాళ్లు అప్పుడప్పుడు మగవాల్లను రఫ్ ఆడిస్తున్న వీడియోలు అయితే నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి.ఇక ఆడవాళ్లు కొందరు మాత్రమే సాఫ్ట్ గా ఉంటారు.
కానీ చాలామంది ఆడవాళ్లు అయితే కోపం వచ్చిందంటే శివంగిలా మారిపోయి ఎవరైతే ఇబ్బందులు పెడతారో వారిని తుక్కు రేగ్గొడతారు.ఇక ఇప్పుడు కూడా ఇలా ఓ మహిళ చేసిన పని ఇప్పుడు విపరీతంగా హల్ చల్ చేస్తోంది.అసలు ఆ మహిళకు ఏమైందో ఏమో తెలియదు గానీ ఇంతలోనే అక్కడ ఉన్న ఓ యువకుడిని పట్టుకుని దారుణంగా కొట్టేసింది.ఎంతలా అంటే ఆ మహిళ అతడిని కొడుతున్నా కానీ అక్కడే ఉన్న వారు ఎవరూ కూడా అడ్డుపడలేకపోయారు.
ఇంక ఏకంగా వీడియో తీస్తూ ఆమెను ఎంకరేజ్ చేసేస్తున్నారు.వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నంలోని క్రాంతి నగర్ లో ఓ షాప్ యజమాని అయిన ఆ మహిళతో షాపింగ్ చేయడానికి వచ్చిన ఓ యువకుడు కొంత అభ్యంతరకరంగా మాట్లాడటంతో తట్టుకోలేక ఆమె అతడిని దుమ్ములేపేసిది.మహిళ కోపానికి ఆ వ్యక్తి దారుణంగా దెబ్బలు తిన్నాడు.ఇక అసలు ఏం జరిగిందో తెలియక అక్కడే ఉన్న వారంతా కూడా ఆ వివాదాన్ని చూసి చాలా షాక్ అయిపోయారు.
అక చాలా సేపు తర్వాత వారు తేరుకొని ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయసాగారు.ఇక శివంగిలా మారిపోయిన ఆ మహిళ దాడిలో ఆ వ్యక్తికి స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తోంది.
ఈ ఘటన కు సంబంధించిన వీడియో కాస్తా ఇప్పుడు నెట్టింట్ హల్ చల్ చేయడం పరిపాటిగా మారిపోయింది.కాగా స్థానికి పోలీసులకు మాత్రం ఈ దాడి పై ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలుస్తోంది.