బాబోయ్ : వైజాగ్ నుంచి హైదరాబాద్ రేటు మూడు వేలు !!

అవకాశం వచ్చినప్పుడే దండుకోవాలన్న దారుణ నీతిని ప్రదర్శిస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ యజమాన్యాలు.తెలుగు వారు అందునా ఆంధ్రాప్రాంతానికి చెందిన వారు పెద్ద పండుగ్గా జరుపుకునే సంక్రాంతికి సొంతూర్లకు వెళుతుండటం తెలిసిందే.

 Vizag To Hyderabed Bus Ticket Costs 3k-TeluguStop.com

భారీగా ఉన్న డిమాండ్ ను సొమ్ము చేసుకోవటానికి వీలుగా.ప్రైవేటు వాహన యజమానులు బస్సు టిక్కెట్టు ధరల్ని విపరీతంగా పెంచేశారు.

విశాఖపట్నం నుంచి హైదరాబాద్ బస్సు టిక్కెట్ ధరను రూ.3వేలకు పెంచేశారు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.వైజాగ్ నుంచి హైదరాబాద్ కు విమాన ప్రయాణ టిక్కెట్టు ధర కేవలం రూ.2800 మాత్రమే.కొన్ని సందర్భాల్లో ఇంతకంటే తక్కువే ఉంటుంది.

 Vizag To Hyderabed Bus Ticket Costs 3k-Vizag To Hyderabed Bus Ticket Costs 3k-Ge-TeluguStop.com

తాజాగా నెలకొన్న డిమాండ్ ను అసరాగా చేసుకొని భారీగా సొమ్ము చేసుకోవటానికి వీలుగా ప్రైవేట్ బస్సుల వారు టిక్కెట్ల ధరను భారీగా పెంచేశారు.

గురువారంతో మొదలైన పండగను ఆదివారం వరకూ జరుపుకొని.

ఆ రోజు ప్రయాణం చేసి సోమవారం ఉదయానికి చేరుకొని ఆఫీసులకు వెళ్లాలన్న ఆలోచనలో ఉండటంతో ఆదివారం రిటర్న్ టిక్కెట్లకు భారీ డిమాండ్ మొదలైంది.నిన్నటి వరకూ ఊళ్లకు వెళ్లే టిక్కెట్ ధరల్ని భారీగా పెంచేసి ట్రావెల్స్ సంస్థలు.

ఇప్పుడు రిటర్న్ జర్నీ మీద దృష్టి పెట్టాయి.విశాఖ.హైదరాబాద్ కు రూ.3వేలు.విశాఖ.తిరుపతికి రూ.4వేలుగా వసూలు చేస్తున్నారు.ఇన్నేసి డబ్బులు ఖర్చు పెట్టినా.

కొన్ని రూట్లలో టిక్కెట్లు దొరక్కపోవటం మరో విశేషంగా చెప్పొచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube