స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వైజాగ్ టీడీపీ సంచలన నిర్ణయం..!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రానికి రెండు సార్లు లేఖ రాయడం మాత్రమే గాక ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అఖిలపక్ష సభ్యులతో కలిసి సమావేశం అవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

 Vizag Tdp Sensational Decision Against Steel Plant Privatization Decision Ys Jag-TeluguStop.com

పరిస్థితి ఇలా ఉండగా ఇప్పటికే ఈ విషయంలో టిడిపి పార్టీ ఎమ్మెల్యే కీలక నేత గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం జరిగింది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంలో వైజాగ్ టిడిపి కార్పొరేటర్లు పాదయాత్ర చేపట్టారు.

వైజాగ్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున కూర్మన్నపాలెం జంక్షన్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కాగడాలతో నగరపాలక సంస్థ వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది.టీడీపీ కార్పొరేటర్ల తో పాటు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది.

ఈ క్రమంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్ లో తీర్మానం చేయడానికి టిడిపి కార్పొరేటర్లు తీర్మానం చేసుకున్నారు.కొన్ని వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి.

ప్రైవేటీకరణ అయితే కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయని టీడీపీ కార్పొరేటర్లు సంచలన కామెంట్లు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube