జనసేన వైపు చూస్తున్న ఆ టీడీపీ ఎమ్మెల్యే ఈయనేనా ?

రాజకీయ నాయకులు పార్టీలు మారడం పెద్ద విషయం ఏమీ కాదు.తమకు ఏ పార్టీలో కంఫర్ట్ గా ఉంటుందో, ఏ పార్టీలో ఎక్కువ ప్రయోజనం ప్రాధాన్యం దక్కుతుందో చూసుకుని ఆ పార్టీలోకి జంప్ అయిపోతుంటారు.

 Vizag Tdp Mla Ganta Srinivasa Rao Try To Join Janasena Party, Tdp, Chandrababu,-TeluguStop.com

అయితే తరచుగా పార్టీలు మారుతూ ఉంటే అది ఎప్పుడో ఒకప్పుడు తీవ్ర ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశంతో పాటు , వారి రాజకీయ భవిష్యత్తును గందరగోళంలో పడేస్తుంది.ఇప్పుడు అటువంటి గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు టిడిపి విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఆయన ఏ పార్టీలో చేరినా ఎమ్మెల్యేగా గెలవడం,  మంత్రి పదవి పొందడం జరిగేవి.2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు మంత్రి పదవిని పొందారు.అంతకుమదు కాంగ్రెస్ ప్రభుత్వం లోనూ ఆయన మంత్రిగా పనిచేశారు.దానికంటే ముందు ప్రజారాజ్యం ను కాంగ్రెస్ లో విలీనం చేసిన సందర్భంలోనూ ఆయనకు మంత్రి పదవి దక్కింది.

అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆయన పోటీ చేసేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, ఆ పార్టీ గంటాను  చేర్చుకునేందుకు ఇష్ట పడకపోవడంతో అయిష్టంగా నే టిడిపి నుంచి పోటీ చేసి విశాఖ ఉత్తర నియోజకవర్గ  ఎమ్మెల్యే గా గెలుపొందారు.గెలిచిన దగ్గర నుంచి టిడిపి తో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు.

వైసీపీలో చేరేందుకు కు మొన్నటి వరకు గంటా ప్రయత్నాలు చేస్తూనే వచ్చినా, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడ్డుకోవడంతో గంట ఆశ తీరలేదు.ప్రస్తుతం ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

ఆయన రాజీనామా ను ఇప్పటివరకు ఆమోదించలేదు.
 

Telugu Vizag Narth Mla, Chandra Babu, Chandrababu, Gantasrinivasa, Jagan, Janase

ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఆయన జనసేన పార్టీలో చేరేందుకు గంటా ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.ఆయన టిడిపిలో ఉన్నా, లేనట్టుగానే టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు.త్వరలో గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జి ని నియమించేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.

దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన టిడిపి లో ఉన్నా, టికెట్ ఇచ్చే చాన్స్ లేదు అనే విషయం అర్థం అయిపోయింది.దీంతో గంట జనసేనలోకి వెళ్లేందుకు ముమ్మరం ప్రయత్నాలు చేస్తున్నారు.

త్వరలోనే టిడిపి జనసేన పార్టీలు పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుండటంతో,  ఈ రెండు పార్టీలు కలిస్తే తప్పకుండా అధికారంలోకి వస్తాయి అనే అంచనాలో ఘంటా ఉన్నారు.  దీనిలో భాగంగానే ఆయన జనసేన లో చేరేందుకు సంప్రదింపులు చేస్తున్నారు.

అన్ని ఓకే అయితే త్వరలోనే జనసేన తీర్థం పుచ్చుకునే ఛాన్స్ ఉండబోతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube