విశాఖ స్టీల్ ప్లాంట్ లో కలకలం.. ఆ లేఖనే కారణమా.. ?

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం గాల్లో కలసిపోతున్నట్లుగా ఉంది.కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయం వల్ల ఈ విషయంలో ఏపీలో పెద్ద ఉద్యమమే సాగుతుంది.

 Vizag Steel Plant Employee Releasing Suicide Note Vizag, Steel Plant, Employee,-TeluguStop.com

ఇక పలు కార్మిక సంఘాలు కూడా విశాఖ ఉక్కు పైవేటీకరణను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపధ్యంలో విశాఖ ఉక్కు గర్జన పేరుతో విశాఖలో కార్మికులు ఈరోజు సాయంత్రం భారీ సభను ఏర్పాటు చేసి, ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

ఇదే సమయంలో స్టీల్ ప్లాంట్ కు చెందిన ఓ కార్మికుడు రాసిన సూసైడ్ నోట్ కలకలం సృష్టించింది.

విశాఖ ఉక్కును ఎట్టిపరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరించేందుకు ఒప్పుకోవద్దని, 32 మంది ప్రాణత్యాగం వలన ఉక్కు పరిశ్రమ వచ్చిందన్న విషయం గుర్తుంచుకోవాలని, తన ప్రాణత్యాగంతో ఉక్కు గర్జన ప్రారంభం కావాలని, ఐక్యత పెరగాలని, అందువల్ల ఈ రోజు సాయంత్రం 5:49 గంటలకు ఉక్కు గర్జన ప్రారంభం అయ్యేలోగా ప్రాణత్యాగం చేస్తానని సూసైడ్ నోట్ లో ఆ అజ్ఞాత వ్యక్తి పేర్కొన్నారు.కానీ సూసైడ్ నోట్ రాసి పెట్టిన వ్యక్తి మాత్రం ఎవరన్ని విషయం తెలియరాలేదట.కాగా ఆ వ్యక్తి కోసం పోలీసులు, కార్మికులు గాలిస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube