ఆడవారి జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో.ఒక్కోసారి అంత దుఃఖంతో నిండి ఉంటుంది.
మహిళ మనసు గొప్పదే అయినప్పటికీ.దాన్ని ఆకారణంగా కొందరు మగవాళ్లు చిత్ర హింసలపాలు చేస్తారు.
శారీరకంగా కొట్టిన దెబ్బల కంటే మానసికంగా కొట్టిన దెబ్బలే తీవ్ర వేదన కలిస్తాయంటారు సినిమాలతో పాటు పలు సీరియల్స్ లో నటించిన వైజాగ్ జగదీశ్వరి.తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను జీవితంలో అనుభవించిన బాధలను వివరించింది.
జగదీశ్వరికి చిన్నప్పుడే పెళ్లైంది.19 ఏండ్లకే భర్త చనిపోయాడు.అప్పటికే తనకు ఓ పాప, బాబు పుట్టారు.పాపను అక్కవాళ్లు తీసుకున్నారు.
వాళ్లే పెంచుకున్నారు.బాబు తన దగ్గరే ఉన్నాడు.
చిన్నప్పుడే భర్త చనిపోవడంతో మళ్లీ పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు చెప్పారు.అప్పుడే తన నాటకాలను ఇష్టపడే ఓ లాయర్ తనను పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చాడు.
మొత్తంగా అందరి సమక్షంలో పెళ్లి అయ్యింది.
కొంత కాలం వీరి కాపురం సజావుగానే సాగింది.ఆ తర్వాతే తన రెండో భర్తలో తేడా వచ్చింది.తన కొడుకును అస్సలు ఇష్టపడేవాడు కాదు.
చీటికి మాటికి కోప్పడేవాడు.అస్సలు ప్రేమ చూపించే వాడు కాదు.
దానికి తోడు ఒకరోజు దాచుకున్న డబ్బులను దొంగతనంగా తీసుకెళ్లి క్రికెట్ బ్యాట్ కొనుక్కున్నాడని కొడుకుని జగదీశ్వరి కొట్టింది.కాస్త కోపం ఎక్కువగా ఉన్న కొడుకు ఇంట్లో నుంచి పారిపోయాడు.
సుమారు 9 ఏండ్ల పాటు తల్లికి కనిపించలేదు.అటు భర్త మంచివాడు కాక ఇటు కన్న కొడుకు దూరమై తాను ఎంతో మానసిక క్షోభ అనుభవించినట్లు చెప్పింది.
అనవసరంగా రెండో పెళ్లి చేసుకుని తప్పు చేశానే అని బాధపడినట్లు వెల్లడించింది. నిజానికి రెండో పెళ్లి చేసుకున్న ఏ మహిళ జీవితం అయినా బాధలతో నిడింపోతుందని చెప్పింది.
సంతోషంగా బతికే వారు నూటికి ఒక్కరో ఇద్దరో మాత్రమే ఉంటారని చెప్పింది.ప్రస్తుతం తన కొడుకు తన దగ్గరే ఉంటున్నట్లు చెప్పింది జగదీశ్వరి.
ప్రస్తుతం కొడుకు డ్యాన్స్ స్కూల్ నడిపిస్తున్నట్లు చెప్పింది.అంతేకాదు తన కోడలు కూడా మంచి డ్యాన్సర్ అని చెప్పింది.
తన కొడుకు ముస్లీం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది.ప్రస్తుతం అందరూ కలిసి సంతోషంగా ఉంటున్నట్లు చెప్పింది.
అటు తన భర్త ప్రస్తుతం వైజాగ్ లో లీడింగ్ లాయర్ అయినా మంచి మనసు మాత్రం లేదని చెప్పింది.