'క్రాక్' తో మళ్ళీ హంగామా మొదలుపెట్టిన మాస్ రాజా !

టాలీవుడ్ లో మాస్ మహారాజాగా పేరు తెచ్చుకున్న రవితేజ చాలా రోజులుగా వరస ప్లాపులతో సతమతమవుతున్నాడు.రవితేజ కెరీర్ కు ఒక హిట్ చాలా అవసరం.

 Vizag Jagadamba Theatre Opened With Krack Movie-TeluguStop.com

అదే సమయంలో 2021 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయినా క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రవితేజ కెరీర్ మళ్ళీ పుంజుకుంది. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత మళ్ళీ వరస ప్లాపులతో ఉన్న రవితేజకు క్రాక్ సినిమా హిట్ అవ్వడం ఆయనలో జోష్ ను నింపింది.

Telugu Krack Movie, Ravi Teja, Vizag Jagadamba Theatre, Vizag Jagadamba Theatre Opened With Krack Movie-Movie

రవితేజతో బలుపు, డాన్ శీను చిత్రాలను చేసిన గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాను తెరకెక్కించాడు.రవితేజ అభిమానులు ఆయనను ఎలా చూడాలి అనుకున్నారో ఆ రేంజ్ లో దర్శకుడు మాస్ రాజాను చూపించి అసలు సిసలు పండగంటే ఎలా ఉంటుందో ఈ సినిమాతో నిరూపించాడు.మాస్ మహారాజ రవితేజ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించాడు.కలెక్షన్ల పరంగా కూడా క్రాక్ సినిమా రికార్డు స్థాయిలో కుమ్మేసింది.

 Vizag Jagadamba Theatre Opened With Krack Movie-క్రాక్’ తో మళ్ళీ హంగామా మొదలుపెట్టిన మాస్ రాజా -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

క్రాక్ సినిమాలో రవితేజకు జోడిగా శృతి హాసన్ నటించారు.ఈమెకు కూడా చాలా రోజుల నుండి సరైన హిట్ లేక ఫామ్ లో లేదు.

ఈ సినిమా హిట్ తో మళ్ళీ వరుస ఆఫర్లు దక్కించుకుని బిజీ హీరోయిన్ అయిపోయింది.కరోనా కారణంగా 50 శాతం ఆక్యుపెన్సీతోనే రిలీజ్ అయ్యినా.

లాభాలను తీసుకొచ్చి.బయ్యర్లకు, డిస్టిబ్యూటర్లకు అనందం తీసుకువచ్చింది.

Telugu Krack Movie, Ravi Teja, Vizag Jagadamba Theatre, Vizag Jagadamba Theatre Opened With Krack Movie-Movie

అయితే ఈ రోజు మళ్ళీ మరొకసారి క్రాక్ హంగామా మొదలైంది.కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈ రోజు వైజాగ్ లోని జగదాంబ థియేటర్ లో మార్కింగ్ ఒక షో తో మళ్ళీ థియేటర్ తలుపులు తెరుచుకున్నాయి.దీంతో మళ్ళీ క్రాక్ హంగామా మొదలు పెట్టడానికి సినిమా లవర్స్ కూడా రెడీ అయ్యారు.మరి చూడాలి ఈ సినిమాలాగే మరిన్ని సినిమాలు విడుదల అవుతాయో లేదో.

#VizagJagadamba #VizagJagadamba #Ravi Teja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు