ఏడు నెలల తర్వాత వైజాగ్‌లో బొమ్మ పడింది  

vizag inox theater re open, Vizag, Inox Theater, Covid effect, Lockdown, Seven months, old movies - Telugu Covid Effect, Inox Theater, Inox Vizag, Lockdown, Old Movies, Seven Months, Telugu Film News, Theaters Open, Vizag Inox Theater Re Open

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా దాదాపు ఏడు నెలల పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతపడి ఉన్నాయి.ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు రావడంతో దేశంలో పలు చోట్ల థియేటర్లను ఓపెన్‌ చేశారు.

TeluguStop.com - Vizag Inox Theater Re Open

కాని తెలుగు రాష్ట్రాల్లో మాత్రం థియేటర్ల ఓపెన్‌ కు యాజమాన్యాలు సిద్దం కాలేదు.కొన్ని మల్టీప్లెక్స్‌లు మాత్రం ఏపీలో నిన్నటి నుండి ప్రారంభించారు.

పాత సినిమాలనే పైలెట్‌ ప్రాజెక్ట్‌ అన్నట్లుగా ప్రదర్శించారు.వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌ కు సమీపంలో ఉండే ఐమాక్స్‌ థియేటర్‌ ను ఏడు నెలల తర్వాత ఓపెన్‌ చేశారు.

TeluguStop.com - ఏడు నెలల తర్వాత వైజాగ్‌లో బొమ్మ పడింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు 50 శాతం ఆక్యుపెన్సీతో షోలు ప్రదర్శించారు.ప్రక్షకులు చాలా తక్కువగా వచ్చారు.10 శాతం ఆక్యుపెన్సీ కూడా రాలేదు.ముందు ముందు అయినా ప్రేక్షకులు వస్తారనే ఆశతో ఉన్నట్లుగా పేర్కొన్నారు.

ప్రతి రోజు ఇంతకు ముందు నాలుగు లేదా అయిదు షో లు వేసే వారు.కాని ఇప్పుడు కేవలం రెండు షోలను మాత్రమే వేయాలని భావిస్తున్నారట.వైజాగ్‌ లో ఉన్న మొత్తం థియేటర్లను ఎప్పటి వరకు ఓపెన్‌ చేసేది క్లారిటీ లేదు.ఓపెన్‌ అయిన ఒక్క థియేటర్‌ కే ప్రేక్షకులు లేరు.

అన్ని థియేటర్లను ఓపెన్‌ చేస్తే ప్రేక్షకులు వచ్చేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి లాక్‌ డౌన్‌ తర్వాత థియేటర్లకు అన్‌ లాక్‌ చేసినా కూడా పరిస్థితి కుదుట పడేందుకు మునుపటి స్థితికి వచ్చేందుకు కనీసం రెండు మూడు నెలలు అయినా పట్టవచ్చు అంటున్నారు.

సినిమా థియేటర్లు పూర్తి స్థాయిలో వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్‌ వరకు నడుస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.భారీ ఎత్తున అంచనాలున్న సినిమాలు విడుదల అయితే అప్పుడు మళ్లీ థియేటర్లు కళకళలాడుతాయి.

#Theaters Open #Old Movies #Seven Months #Inox Theater #VizagInox

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vizag Inox Theater Re Open Related Telugu News,Photos/Pics,Images..