అందుకుగాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించిన తెలుగు చిన్నారి!

ఇది ఓ సినిమాని తలపించే గాధ అని చెప్పుకోవచ్చు.అపుడెపుడో ప్రేమ కధల దర్శకుడు తేజ తెరకెక్కించిన సినిమా జయం మాదిరి కథ.

 Vizag Girl Mamidi Ramya Placed In World Book Of Records For Her Reverse Writing-TeluguStop.com

జయం సినిమాలో హీరోయిన్ చెల్లెలు ట్రైన్ పై తెలుగు పదాలను రివర్స్ లో రాసి, హీరోకి క్లూ ఇస్తూవుంటుంది.వాటిని మళ్లీ అద్దంలో చూస్తే తప్ప మనం చదవలేము.

అది సినిమా.అయితే అలాంటి సన్నివేశం ఇక్కడ మన విశాఖపట్నంలో జరిగింది.

వైజాగ్ కి చెందిన రమ్య టాలెంట్ కూడా అలాంటిదే.ప్రస్తుతం ఆమె ప్రతిభకు నీరాజనాలు అందుకుంటోంది.

రివర్స్ లో రాస్తూ తన టాలెంట్ నిరూపించుకుంటోంది.

వివరాల్లోకి వెళితే, అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం మండలం, ధర్మసాగరం గ్రామానికి చెందిన మామిడి రమ్య మామిడి మోహన్ రావు, మీనాక్షిల యొక్క గారాల పట్టి.

ఈమె చిన్నప్పుడు నుండే అన్ని అక్షరాలను రివర్స్ లో రాసేదట.ఇక అలా తన చిన్నతనంలో రాస్తుంటే అక్కడి టీచర్లు, ఇంట్లో వాళ్లు తిట్టేవారట.

బాగారాయమని అంటే సరిగ్గా రాయమని మందలించేవారట.అవేవి రమ్య చెవులకు ఎక్కేవి కావు.

తనకి అలా రాయడంలోనే ఆనందం ఉండేదట.అలా చిన్నప్పటి నుండి ఇంట్లో వాళ్ళు పేర్లు, ఫ్రెండ్స్ పేర్లు రివర్స్ లో రాస్తూ ఉండేదట.

అలా సరదాగా మొదలైన ఈ అలవాటు క్రమ క్రమంగా ఆమెలో ఆసక్తిని పెంచింది.

అలా అందరి కన్నా భిన్నంగా ఉండాలనుకునే రమ్య ఈ రివర్స్ రైటింగ్ లో ఏదైనా ఘనత సాధించాలనుకుంది.

Telugu Guinness, Mamidi Ramya, Meenakshi, Reverse, Latest, Vizag, Books-Latest N

ఈ క్రమంలో ఇలా రాస్తే వరల్డ్ లెవల్, ఇంటర్నేషనల్, గిన్నిస్ రికార్డులు వస్తాయని తెలుసుకొని అందులో సాధన చేసింది.ఏముంది కట్ చేస్తే, ఆమె ప్రతిభకుగాను వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్ర్ అవార్డు వెతుక్కుంటూ వచ్చింది.3 బాషల్లో ఆమె ప్రతిభ ప్రదర్శనను గిన్నిస్, వరల్డ్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ ఆఫ్ రికార్డు అధికారులకు రమ్య పంపింది.రమ్య ప్రతిభకు ముందుగా వరల్డ్ వైడ్ ఆఫ్ రికార్డులో స్థానం లభించింది.

ఇంకా గిన్నిస్ బుక్.ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డుకి కూడా అప్లైచేశానని, అందులోకూడా తాను కచ్చితంగా చోటు సంపాదించుకుంటానని రమ్య ధీమాగా చెబుతోంది.

ఇలా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలను రివర్స్ లో రాస్తూ రమ్య సత్తా చాటుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube