ఎల్జీ పాలిమర్స్ సీఈఓతో పాటు పలువురు కీలక వ్యక్తులు అరెస్ట్

బొపాల్ గ్యాస్ దుర్ఘటన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మరోసారి సంచలనం అయిన గ్యాస్ లీక్ ఘటన విశాఖలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన ఆ పరిశ్రమ నుంచి ప్రమాదకర స్టైరీన్ విషవాయువు లీకై 15 మంది మృతి చెందడం తీవ్ర సంచలనం సృష్టించింది.ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

 Vizag Gas Leak, Ceo, Two Directors Of Lg Polymers Arrested, Ap Cm Jagan, Lg Poly-TeluguStop.com

ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ ఘటన తర్వాత పరిశ్రమల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.ఇక ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి విచారణకి ఆదేశించింది.

ఈ కమిటీ తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.ఈ నివేదికలో కీలక విషయాలని వెల్లడించింది.

ఈ అంశాల ఆధారంగా తాజాగా, ఈ ఘటనలో పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు.

అరెస్ట్ అయిన వారిలో ఎల్జీ పాలిమర్స్ సీఈఓ సున్ కి జియాంగ్, సంస్థ డైరెక్టర్ డీఎస్ కిమ్, అదనపు డైరెక్టర్ మోహన్ రావు ఉన్నారు.

హై పవర్ కమిటీ నివేదికలో గ్యాస్ లీక్ ప్రమాదానికి ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ నిందితులపై పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఇక నీరబ్ కుమార్ కమిటీ కూడా యాజమాన్య నిర్లక్ష్యమే ప్రమాదానికి దారితీసిందని వెల్లడించింది.

దీంతో విదేశీ కంపెనీని అయిన కూడా ఏపీ సర్కార్ వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రమాదానికి బాధ్యులుగా గుర్తించి వారందరిని అరెస్ట్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube