వైసీపీ వైపు చూస్తున్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాస్  

వైసీపీలో చేరడానికి రెడీ అవుతున్న వైజాగ్ మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాస్. .

  • ప్రస్తుతం ఏపీలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఇక పోటీ చేసిన డిపాజిట్లు కూడా వస్తాయో రావో అనే పరిస్థితిలో ఉంది. దీంతో తప్పని పరిస్థితిలో ఆ పార్టీలలో ఉన్న రాజకీయ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీ, వైసీపీలని వేదికగా మార్చుకుంటున్నాయి. జనసేన పార్టీ వైపు వచ్చే ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ నుంచి సానుకూలత వ్యక్తం కాకపోవడంతో తన భవిష్యత్తుని వెతుక్కుంటున్నారు.

  • ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏపీలో వైసీపీ పార్టీకి సానుకూలత ఉండటంతో చాలా మంది నేతలు జగన్ వైపే చూస్తున్నారు. దీంతో ఇప్పటికే ఆ పార్టీలోకి ఓవర్ ఫ్లో అయ్యింది అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇప్పుడు విశాఖకి చెందిన కాంగ్రెస్ పార్టీ కీలక నేత ద్రోణం రాజు శ్రీనివాస్ కూడా ఇప్పుడు వైసీపీ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. వైజాగ్ లో తూర్పు నియోజకవర్గంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకి మళ్ళీ సీటు కన్ఫర్మ్ చేసింది. అయితే స్థానికంగా బలమైన నాయకుడుగా ఉన్న అతన్ని ఓడించాలంటే స్థానికంగా మంచి గుర్తింపు ఉన్న ద్రోణం రాజు అయితే బెటర్ అనే అభిప్రాయంతో వైసీపీ అతనికి తూర్పు ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు హామీ ఇచ్చిందని తెలుస్తుంది. దీంతో ద్రోణం రాజు కూడా వైసీపీ ఆఫర్ పై సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.