వివేకా హత్యకేసు లో ఏపీ సర్కార్ కు ఎదురుదెబ్బ

మాజీ ఎంపీ,ఏపీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.వివేకా హత్య కేసుపై సిట్ అధికారులతో దర్యాప్తు జరిపించిన సంగతి తెలిసిందే.

 Viveka Case Transfered To Cbi-TeluguStop.com

అయితే ఈ కేసును సీబీఐ కి అప్పగించాలి అంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా ఏపీ సర్కార్ అవసరం లేదు అంటూ దాటవేస్తూ వచ్చింది.దీనితో ఈ కేసును సీబీఐ కి అప్పగించాలి అంటూ హైకోర్టు ను ఆశ్రయించగా తాజాగా సీబీఐ కి ఈ కేసును హైకోర్టు అప్పగించింది.

సిట్‌ నివేదికను 2 సీల్డ్‌ కవర్లలో న్యాయస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించగా వాదనలు విన్న కోర్టు ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలను కోర్టు కొట్టి వేస్తూ సీబీఐ కి ఈ కేసును అప్పగిస్తూ తీర్పు వెల్లడించింది.ప్రతి పక్షంలో ఉన్న సమయంలో ఏపీ సీఎం జగన్ ఈ కేసును సీబీఐ కు అప్పగించాలి అంటూ అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ని డిమాండ్ చేశారు.

అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధించడం తో ప్రభుత్వాన్ని ఏర్పరచిన ఆయన ఈ కేసు సీబీఐ విచారణ ఆవరసం లేదని,సిట్ విచారణ సరిగా కొనసాగుతుంది అంటూ జాగర్ సర్కార్ స్పష్టం చేసింది.

అయితే వివేకా కేసును సీబీఐ కి అప్పగించాలి అంటూ వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు హైకోర్టు లో పిటీషన్లు దాఖలు చేశారు.

అయితే ఈ పిటీషన్ లపై కోర్టు విచారణ జరిపి తాజాగా ఈ కేసును సీబీఐ కి అప్పగించాలి అంటూ తీర్పు వెల్లడించింది.ఈ కేసులో బీటెక్‌ రవి, ఆదినారాయణరెడ్డి వేసిన పిటిషన్లపై కూడా హైకోర్టులో విచారణ జరిగినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube