ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్‌కు జంప్‌లు: అమెరికాలో భారత విద్యార్ధి మృతి  

Indian American Medical Student Died In Philadelphia - Telugu Medical Student Died In Philadelphia, Ndian American Medical Student, Nri, Telugu Nri News Updates

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.ఫిలడెల్ఫియాలో భారతీయ విద్యార్ధి మరణించారు.

Indian American Medical Student Died In Philadelphia

వివేక్ సుబ్రమణి అనే యువకుడు డ్రెగ్జిల్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు.ఈ నేపథ్యంలో గత శనివారం స్నేహితులతో కలిసి తాను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ పై అంతస్తుకు వెళ్లాడు.

అనంతరం ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్‌పైకి వారు దూకడం మొదలుపెట్టారు.సరదాగా భావించిన ఈ ఆటలో ప్రమాదవశాత్తూ వివేక్ అదుపుతప్పి కింద పడిపోయాడు.ఈ ఘటనతో షాక్‌కు గురైన అతని స్నేహితులు కిందకు వచ్చారు.రక్తపు మడుగులో ఉన్న వివేక్‌కు అప్పటికే పల్స్ పడిపోవడం, శ్వాస ఆడకపోవడంతో అతని మిత్రులు నోటి ద్వారా శ్వాస అందించి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

చివరికి చేసేది లేక అతనిని థామస్ జెఫర్‌సన్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు.వివేక్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మరణించినట్లు తెలిపారు.వివేక్ సుబ్రమణి మరణంతో అతని కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయారు.ప్రమాదం జరిగే సమయంలో వివేక్ మద్యం తాగి ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.వివేక్ మృతదేహాన్ని భారతదేశానికి తరలించేందుకు గాను సిగ్మా బీటా రో ఫిలడెల్ఫియా ఫన్ రైజింగ్‌కు పిలుపునిచ్చింది.

తాజా వార్తలు

Indian American Medical Student Died In Philadelphia-ndian American Medical Student,nri,telugu Nri News Updates Related....