ఎన్టీఆర్ ట్రిబ్యూట్ సాంగ్… హీరో-మ్యూజిక్ డైరెక్టర్ మధ్య గొడవ  

Vivek Sagar Vishwak Sen Jr Ntr - Telugu Jr Ntr, South Cinema, Telugu Cinema, Tollywood, Vivek Sagar Disowns. Vishwak Sen\\'s Tribute To Jr Ntr

ఈ మధ్యకాలంలో వివాదాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిన హీరో విశ్వక్ సేన్ .ఈ కుర్ర హీరో వరుస హిట్స్ కొట్టడంతో ఎవరైనా తనకి నచ్చకపోతే బహిరంగంగా తిట్టడం భాగా అలవాటు అనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది.

 Vivek Sagar Vishwak Sen Jr Ntr

ఆ మధ్య విజయ్ దేవరకొండ ఫాన్స్ తో కయ్యం పెట్టుకున్న ఈ కుర్ర హీరో ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కున్నాడు.తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా ట్రిబ్యూట్ సాంగ్ అంటూ ఒక పాట రిలీజ్ చేశాడు.

ఇప్పుడు ఈ సాంగ్ హీరో విశ్వక్, అతని సూపర్ హిట్ మూవీ ఫలక్ నుమా దాస్ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ మధ్య గొడవకి కారణం అయ్యింది. విశ్వక్ స్వీయ ద‌ర్శ‌క‌త్వం, నిర్మాణంలో వ‌చ్చిన ఫ‌ల‌క్ నుమా దాస్ కోసం సంగీత ద‌ర్శ‌కుడు వివేక్ సాంగ్ ఓ రాప్ సాంగ్ కంపోజ్ చేశాడు.

ఎన్టీఆర్ ట్రిబ్యూట్ సాంగ్… హీరో-మ్యూజిక్ డైరెక్టర్ మధ్య గొడవ-Movie-Telugu Tollywood Photo Image

రాప్ సాంగ్‌ను వాడుకుని దానికి త‌న‌, ఎన్టీఆర్ విజువ‌ల్స్ జోడించి విశ్వక్ ట్రిబ్యూట్ ఇచ్చాడు.ఐతే త‌న అనుమ‌తి లేకుండా ఈ పాట‌ను వాడుకున్నాడంటూ వివేక్ అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో వారి మధ్య రచ్చ మొద‌లైంది.

ఈ పాటను తొల‌గించాలంటూ వివేక్ కామెంట్ కూడా పెట్టాడు.దీనిని విశ్వ‌క్ లెక్క చేయకపోవడం వివేక్, విశ్వ‌క్ మీద లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకుంటూ నోటీసులు పంపించాడు.ఐతే ఈ పాట తాను ప్రొడ్యూస్ చేసిన సినిమా కోసం కంపోజ్ చేయించుకున్న‌ది కావ‌డంతో దానిపై సర్వ‌హ‌క్కులూ త‌న‌వే అని విశ్వక్ వాదిస్తున్నాడు.ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పాటపై మాకు హ‌క్కులు ఉన్నాయి.

దానిని ఎలా ఉపయోగించుకోవాలన్నది మా ఇష్టం ఆ పాటను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించం.ఈ పాటకు సంబంధించి వివేక్ క్రెడిట్ ఇచ్చాం.

ఆయన అనుమతి లేకుండా చేయడం నా తప్పే.అందుకు క్షమాపణలు కూడా చెబుతున్నాను అని విశ్వ‌క్ చెప్పాడు.

మరి విశ్వక్ చెప్పిన అపాలజీకి వివేక్ చల్లబడతాడా లేకా గొడవని పెద్దది చేస్తాడా అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test