బొల్లి..మచ్చల నివారణకు ఆయుర్వేదంతో చెక్..పెట్టచ్చు     2017-10-13   00:31:06  IST  Lakshmi P

బొల్లి..దీన్ని ఆయుర్వేద భాషలో శ్వేత కుష్టం అంటారు..ఇది వచ్చినవాళ్ళు తీవ్రమైన మానసిక వేదనకి లోనవ్వుతారు.. నలుగురిలో తిరగడానికి సైతం ఇబ్బందిగా ఫీల్ అవుతారు..బొల్లి ఎలా ఏర్పడుతుంది అంటే..

మన రక్షణ వ్యవస్థ మెలనోసైట్స్‌పైన దాడి చేయటం వల్ల ఆ ప్రాంతంలో మెలనోసైట్స్‌ నశించి ఆ ప్రాంతం తెల్లబడి మచ్చలు ఏర్పడతాయి.జీర్ణాశయ వ్యవస్థలో ఏర్పడ్డ ఇన్‌ఫెక్షన్ల వల్ల ఏర్పడతాయి..

బిగుతుగా ఉండే దుస్తులు ధరించటం వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఉన్న వారిలో కాలిన గాయాలు, ప్రమాదం జరిగినపుడు ఏర్పడ్డ గాయాలు..పొగతాగడం.కొంతమందిలో ఆటో ఇమ్మ్యుని సిస్టమ్‌ దెబ్బతిన్నప్పుడు డీపిగ్మెంటేషనకి గురి అవుతారు. ఇది కణిజాలపై వ్యతిరేకంగా పనిచేయటం వల్ల మెలనిమైట్స్‌ నశించి బొల్లి రావచ్చు.

వీటిలక్షణాలు ఎలా గుర్తించాలి అంటే చిన్నచిన్న మచ్చలుగా ఏర్పడి ఆ తరువాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరికి తెలుపు రంగులోకి మారుతాయి. చర్మం పలచబడినట్లు ఉంటుంది. కొన్నిసార్లు విపరీతమైన ఎండను తట్టుకోలేదు. జుట్టు రంగుమారటం, రాలిపోవటం, శారీరకంగా అలసిపోవటం లాంటి లక్షణాలుంటాయి.