తొలిసారి స్విమ్ సూట్ లో కనిపించిన వరుణ్ భార్య.. చీర కట్టుకుని ఆ పని చేయలేమంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఒకప్పుడు కెరీర్ పరంగా బిజీగా ఉన్న హీరోలలో వరుణ్ సందేశ్( Varun Sandesh ) ఒకరు.వరుణ్ సందేశ్ నటించిన సినిమాలలో హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందించాయి.

 Vithika Sheru Swim Suit Photo Goes Viral In Social Media Details, Vithika Sheru,-TeluguStop.com

అయితే వరుణ్ సందేశ్ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.వరుణ్ సందేశ్ భార్య వితిక( Vithika Sheru ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

బిగ్ బాస్ షో( Bigg Boss ) ద్వారా ఈ జంట ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకుంది.అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వితికా షేరు తాజాగా స్విమ్ సూట్ లో దిగిన ఫోటోను షేర్ చేయగా ఆ ఫోటో తెగ వైరల్ అవుతోంది.

అయితే సాధారణంగా హీరోల భార్యలు బికినీలో, స్విమ్ సూట్స్ లో ఫోటోలు షేర్ చేస్తే ఆ ఫోటోలపై నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

అయితే తనపై నెగిటివ్ కామెంట్లు రాకుండా తాను ఎందుకు అలాంటి డ్రెస్ ను ధరించాల్సి వచ్చిందో కూడా వితిక వివరణ ఇచ్చారు.దుస్తుల వల్లే అభిప్రాయం మారిపోతుందనే సొసైటీలో మనం బ్రతుకుతున్నామని ఆమె కామెంట్లు చేశారు.చీర కట్టుకుని స్విమ్మింగ్ చేయలేం కదా అని వితిక అన్నారు.

స్విమ్మింగ్ కు వెళితే స్విమ్మింగ్ కు సంబంధించిన దుస్తులు వేసుకుంటామని ఆమె తెలిపారు.

కంఫర్ట్ కు అనుగుణంగా దుస్తులను ధరించడంలో తప్పు లేదని వితికా షేరు చెప్పుకొచ్చారు.టేక్ ఇట్ ఈజీ అని ప్రతి విషయంలో ఇతరులను జడ్జ్ చేయాలని అనుకోవడం కరెక్ట్ కాదని ఆమె అన్నారు.వితికా షేరు చేసిన కామెంట్లకు అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు.

వితికా షేరు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube