అదేంటి వితిక.. బిగ్ బాస్ ని అంత మాట అనేశావ్!  

vithika sheru sensational comments on bigg boss show , vithika sheru,varun sandesh, Bigg Boss show, elimination episode, nagarjuna - Telugu Bigg Boss, Bigg Boss Show, Elimination Episode, Nagarjuna, Varun Sandesh, Vithika Sheru, Vithika Sheru Sensational Comments On Bigg Boss Show

బుల్లితెర రియాలిటీ షోలలో బిగ్ బాస్ షోకు ఉండే క్రేజే వేరు.స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోగా పది రోజుల క్రితం నాలుగో సీజన్ ప్రారంభమైంది.

TeluguStop.com - Vithika Sheru Sensational Comments On Bigg Boss Show

తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా రెండో సీజన్ కు నాని మూడు, నాలుగు సీజన్లను నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు.

రెండు రోజుల క్రితం బిగ్ బాస్ షో రేటింగ్స్ వెల్లడి కాగా వీకెండ్స్ లోనూ, వీక్ డేస్ లోనూ ఈ షో అదిరిపోయే రేటింగ్ తెచ్చుకుంది.

TeluguStop.com - అదేంటి వితిక.. బిగ్ బాస్ ని అంత మాట అనేశావ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

గతంలో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వాళ్లలో కొందరు షో గురించి పాజిటివ్ గా స్పందిస్తే కొందరు నెగిటివ్ గా స్పందించారు.బిగ్ బాస్ సీజన్ తో భర్తతో కలిసి పాల్గొన్న వితికా షేరు తాజాగా ఈ షో గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

చిన్న వయస్సులోనే ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వితిక “అంతు ఇంతు ప్రీతి బంటు” అనే కన్నడ మూవీతో సినీ ప్రస్థానం ప్రారంభించారు.

తెలుగులో ఝుమ్మంది నాదం, భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్ తదితర సినిమాల్లో నటించారు.

అనంతరం హీరో వరుణ్ సందేశ్ ను వివాహం చేసుకున్నారు.తాజాగా వితిక బిగ్ బాస్ షోలో మంచి, చెడు రెండూ ఉంటాయని.

బిగ్ బాస్ షోలో 24 గంటల జీవితం ఉంటుందని ఆ జీవితాన్ని గంటల్లో బిగ్ బాస్ డిసైడ్ చేస్తాడని అన్నారు.బిగ్ బాస్ షోలో పాల్గొనే వాళ్లు కొంత అతి కూడా చేస్తారని ఆమె చెప్పుకొచ్చారు.

మరోవైపు ఈ వారం బిగ్ బాస్ షో నుండి ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.ఓటింగ్ లో గంగవ్వ, అభిజిత్ టాప్ పొజిషన్ లో ఉండగా అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి లీస్ట్ పొజిషన్ లో ఉన్నారని వాళ్లిద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

హోస్ట్ నాగార్జున ఈరోజు కరాటే కల్యాణిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉందని సమాచారం.

#Varun Sandesh #Vithika Sheru #Nagarjuna #VithikaSheru #Bigg Boss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vithika Sheru Sensational Comments On Bigg Boss Show Related Telugu News,Photos/Pics,Images..