Vithika Sheru : నువ్వేమైనా అందగతివా అంటూ వితికాకు షాక్.. అదిరిపోయే కౌంటర్ వేసిన బ్యూటీ?

అప్పుడప్పుడు నెటిజన్స్ సెలబ్రిటీలపై కౌంటర్లు వేస్తూ కామెంట్లు చేస్తూ ఉంటారు.ముఖ్యంగా వారి అందాలపై ఏదో ఒక రకంగా కామెంట్ చేస్తూనే ఉంటారు.

 Vithika Is Shocked By Saying That You Are Beautiful-TeluguStop.com

అయితే తాజాగా వితికా ( Vithika )అందంపై కూడా కామెంట్లు చేశారు.మామూలుగా ఈమెను ఎప్పుడు టార్గెట్ చేస్తూ ఉంటారు కొందరు.

ఆమె ఏ పోస్ట్ చేసినా కూడా ప్రతిసారి నెగటివ్ కామెంట్లు చేస్తూ ఉంటారు.అయితే తాజాగా మరోసారి ఆమెపై దారుణంగా కామెంట్ చేశారు నెటిజన్.

వెంటనే అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది వితికా షేరు( Vithika Sheru ).ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది వితికా షేరు.కానీ అప్పట్లో ఈమె అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు.ఇక ఈమె సినీ నటుడు వరుణ్ సందేశ్( Varun Sandesh ) ను 2016లో ప్రేమ పెళ్లి చేసుకుంది.ఇక ఈమె అప్పట్లో చేసిన సినిమాలు కొన్ని అయినా కూడా నటన పరంగా పర్వాలేదు అన్నట్లుగా మార్కులు తెచ్చుకుంది.

ఈమె సినీ ఇండస్ట్రీకి కేవలం 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అడుగు పెట్టింది.అలా కన్నడ భాషలో పలు సినిమాలలో చేసింది.టాలీవుడ్ ఇండస్ట్రీకి 2008లో పరిచయమయ్యింది.ప్రేమించు రోజుల్లో, ఛలో, మై నేమ్ ఇస్ అమృత వంటి పలు సినిమాలలో నటించి తన నటనకు మంచి పేరు సంపాదించుకుంది.

తర్వాత కొన్ని సినిమాలలో సహాయనిటిగా కూడా చేసింది.తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టింది.ఆ తర్వాత తనతో కలిసి నటించిన వరుణ్ సందేశ్ ను ప్రేమించి పెళ్లి చేసుకోగా కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ తో తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకుంది.2019లో మాటీవీలో ప్రసారమైన బిగ్బాస్ తెలుగు సీజన్ 3 లో తన భర్తతో పాటు తను కూడా కంటెస్టెంట్ గా పాల్గొని బాగా సందడి చేసింది.

ఇక బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది.మంచి అభిమానాన్ని సంపాదించుకుంది.నిత్యం తన డాన్స్ వీడియోలను, వ్యక్తిగత విషయాలను బాగా షేర్ చేసుకుంటూ ఉంటుంది.

ఈమధ్య బాగా వర్కౌట్లు చేస్తూ మంచి ఫిజిక్ కూడా సంపాదించుకుంది.ఫోటోషూట్ లు కూడా చేయించుకుంటూ బాగా సందడి చేస్తుంది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక వీడియో పంచుకుంది.అందులో తన అమ్మమ్మ తనకు తన భర్త వరుణ్ కు దిష్టి తీస్తున్నట్లు కనిపించింది.ఇక ఆ వీడియోను చూసి నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఓ నెటిజన్ నువ్వు ఏమైనా పెద్ద అందగతివా ఏంటి.ఏంటి ఇది మాకు అంటూ కామెంట్ చేయగా వెంటనే వితికా.దిష్టి అందగత్తులని తీయరు.

ఇది మన పద్ధతి.నీ దగ్గర చాలా నెగెటివిటీ ఉంది.

నీ పద్ధతిని జాగ్రత్తగా చూసుకో.గాడ్ బ్లెస్ యు అంటూ కౌంటర్ వేసింది.

ఇక ఈ కౌంటర్ కు అందరు వితికాకు మద్దతు పలుకుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube