బిగ్‌బాస్‌ : వితికతో మహేష్‌ నిజంగానే తప్పుగా ప్రవర్తించాడా?  

Vithika And Mahesh Fighting In Bigg Boss -

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ఆరంభం నుండి కూడా ఆసక్తికరంగా సాగుతుంది.మొదటి రెండు సీజన్‌లతో పోల్చితే ఈసారి ఎక్కువగా సెలబ్రెటీలు ఉన్నారు.

Vithika And Mahesh Fighting In Bigg Boss

తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉన్న వారు అవ్వడంతో ఈ 15 మందిపై కూడా ప్రేక్షకులు చాలా ప్రత్యేకంగా శ్రద్ద పెడుతున్నారు.హౌస్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి వారిదైన ప్రత్యేక శైలి ఉంది.

దాంతో వారు అలరిస్తారని అంతా భావించారు.యూట్యూబ్‌ స్టార్‌గా పేరు దక్కించుకుని వెండి తెరపై కూడా మంచి సినిమాల్లో నటించిన మహేష్‌ విట్టా ఎంట్రీ ఖచ్చితంగా బిగ్‌బాస్‌కు ప్లస్‌ అవుతుందని భావించారు.

బిగ్‌బాస్‌ : వితికతో మహేష్‌ నిజంగానే తప్పుగా ప్రవర్తించాడా-Movie-Telugu Tollywood Photo Image

కాని పరిస్థితి చూస్తుంటే ఆయన తక్కువ రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.

ఆయన గేమ్‌లో ఎక్కువ పార్టిసిపేట్‌ అవ్వక పోవడంతో పాటు, ఇతరుల పట్ల చాలా అగౌరవంగా ప్రవర్తిస్తున్నాడు.మొదట హేమ గురించి తక్కువగా మాట్లాడిన మహేష్‌ ఆ తర్వాత మూడు నాలుగు సార్లు వితికతో కనీస గౌరవం లేకుండా మాట్లాడటం జరిగింది.ఒక లేడీతో మాట్లాడేప్పుడు ఆమె రియాక్షన్‌ను బట్టి ముందుకు వెళ్లాలి.

ఆమె సీరియస్‌గా ఉన్నా కూడా గౌరవం లేకుండా మాట్లాటం అనేది ఏమాత్రం కరెక్ట్‌ కాదు.వితిక షేరు మొదటి నుండి మహేష్‌తో సీరియస్‌గా ఉంటూ వచ్చినా కూడా ఆమెతో జోక్‌ చేయడం లేదంటే ఆమె పట్ల గౌరవం లేకుండా మాట్లాడటం చేశాడు.

మహేష్‌ తన పట్ల అగౌరవంగా ప్రవర్తించాడంటూ వితిక చెప్పడంతో వరుణ్‌ సందేశ్‌ సీరియస్‌ అయ్యాడు.ఏ భర్త అయినా అలా సీరియస్‌ అవ్వడం చాలా కామన్‌.వరుణ్‌ సీరియస్‌ అవ్వడంపై ఏ ఒక్కరు స్పందించడం లేదు.మహేష్‌ ఆ గొడవను పెద్దది అయ్యేలా చేశాడు.ఆమె ఫీల్‌ అయినందుకు సారీ చెప్తే అయిపోయేదానికి మహేష్‌ నేనేం తప్పు చేయలేదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు.ఇది ముందు ముందు అతడిపై ప్రభావం చూపే అవకాశం ఉందనిపిస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vithika And Mahesh Fighting In Bigg Boss Related Telugu News,Photos/Pics,Images..