వయస్సుని తగ్గించి చూపే విటమిన్లు ఇవి  

Vitamins That Help You To Age Backwards-

యాంటి ఏజింగ్ లేదా, ఏజింగ్ బ్యాక్ వర్డ్స్ అనే పదాలు వినే ఉంటారు.వాటి అర్థం మన వయసు కన్నా తక్కువ వయసులో ఉన్నట్లుగా కనిపించటం.ఉదాహారణగా చెప్పాలంటే మన మహేష్ బాబుని తీసుకోండి..

Vitamins That Help You To Age Backwards---

నాలుగు పదుల వయసు దాటినా, ఇంకా పాతికేళ్ళ కుర్రాడిలానే కనబడతాడు.నిజానికి మహేష్ బాబు అందం వయసుతో పాటు పెరుగుతోంది.మరి ఉన్న వయసు కన్నా తక్కువ వయసు వారిలాగా కనబడాలని మీకూ ఉందా? అయుతే మేం చెప్పే విటమిన్లు గుర్తుపెట్టుకోండి.

* విటమిన్ ఏ యూవి రేస్ నుంచి చర్మాన్ని కాపాడుతుంది.అలాగే స్కినగ బ్రేక్ అవుట్స్ ని అడ్డుకుంటుంది.మామిడిపండు, క్యారట్, పాలకూర తింటూ ఉండండి ఈ విటమిన్ కోసం.

* విటమిన్ బి 2 చర్మంలోమి తేమని కాపాడుతుంది.విటమిన్ బి 3 స్కిన్ క్యాన్సర్‌ నుంచి రక్షిస్తుంది.విటమిన్ బి 5 చర్మం ఫ్రెష్ గా కనిపించేందుకు సహాయపడుతుంది.విటమిన్ బి 6 మొటిమలను అడ్డుకుంటుంది.విటమిన్ బి 7 దురదను తగ్గిస్తుంది.* విటమిన్ సి ఇంఫెక్షన్ల నుంచు చర్మాన్ని కాపాడుతుంది.దీనికోసం ఎక్కువగా జామపండు, ఆరెంజ్ మరియు ఇతర సిట్రస్ జాతి ఫలాలు, స్ట్రాబెరీ తినాలి.* విటమిన్ ఈ ముడతలపై ప్రభావం చూపుతుంది.

అలాగే డార్క్ స్పాట్స్ ని తొలగిస్తుంది.అవకాడో, ఆల్మండ్స్, గోధుమలో ఈ విటమిన్ ఉంటుంది.* విటమిన్ ఎఫ్ మచ్చలు, రంధ్రాలు, మొటిమలపై పనిచేస్తుంది.

వాల్నట్స్, ఓలీవ్ ఆయిల్, ఆవకాడో, సాల్మన్ లో ఇది లభిస్తుంది.* విటమిన్ కే చర్మ అరోగ్యానికి ఔషధం లాంటిది.ఇది డార్క్ సర్కిల్స్, ముడతల పై శక్తివంతంగా పనిచేస్తుంది.

మాంసం, గుడ్లు, పాలకూరలో ఇది బాగా లభిస్తుంది.