కాంతివంతమైన చర్మం కావాలంటే ఈ విటమిన్లు గుర్తుపెట్టుకోండి  

Vitamins That Help The Skin To Glow-

టీవిలో అలా మహేష్ బాబు కనబడగానే, తళతళ మెరిసిపోతున్నాడు కదా అనే కామెంట్ లేదా కాంప్లిమెంట్ మెదడులోకి రావడం చాలా కామన్ విషయం.అలా మెరిసిపోవాలని అందరికి కోరికగానే ఉంటుంది.అంతో ఇంతో .మొత్రానికి కాంతివంతమైన చర్మం కావాలంటే మాత్రం ఈ విటమిన్‌లు రుచిచూడండి.* విటమిన్ ఏ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.ఇది డ్రై స్కిన్ తో బాధపడేవారికి గొప్ప నేస్తం.క్యారట్, డార్క్ గ్రీన్ వెజిటబుల్స్, చేపలు, లివర్, స్వీట్ పొటాటో, ఎండు జల్దారు లాంటివాటిలో విటమిన్ ఏ బాగా లభిస్తుంది.

Vitamins That Help The Skin To Glow---

* విటమిన్ బి చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతూ, గ్లోని పెంచుతుంది.చేపలు, గుడ్లు,మాంసం, అరటిపండు, బియ్యం, సన్ ఫ్లవర్ సీడ్స్ లాంటివాటి నుంచి విటమిన్ బి బాగా పొందవచ్చు.* విటమిన్ సి, ముడతలు త్వరగా రాకుండా అడ్డుకోని ఆరోగ్యకరమైన చర్మాన్ని కాపాడుతుంది.

ఆరెంజ్, ఇతర సిట్రస్ ఫలాలు, కాలిఫ్లవర్, బెర్రి, బ్రకోలి, టమోటాలు లాంటివి విటమిన్ సి ని అందిస్తాయి.* చర్మ ఆరోగ్యంలో విటమిన్ ఈ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.పాలకూర, బ్రొకోలి, ఆల్మండ్స్, సోయాబీన్స్, పీనట్స్ లో విటమిన్ ఈ దండిగా దొరుకుతుంది.

* నల్లటి వలయాలు తొలగించంలో సహాయపడుతుంది విటమిన్ కె.పాలకూర, కాలిఫ్లవర్, క్యాబేజీ, డ్రైడ్ బెసిల్ లో విటమిన్ కె ని బాగా కలిగిఉంటాయి.