ఇలా చేస్తే కాలుష్యం మీ దరిచేరదు       2017-09-23   23:09:09  IST  Lakshmi P

ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య కాలుష్యం…దీనివలన ఏటా కొన్ని కోట్లమంది అనేక రోగాల బారిన పడుతున్నారు.పెరిగిపోతున్న కలుష్యకారక విధానాలు,తరిగిపోతున్న అడవులు వెరసి మనిషిని అనారోగ్య స్థితికి నెట్టేస్తున్నాయి.

ఈ వాయు కాలుష్యం వలన జరిగే అనర్థాలు ఇన్నీ అన్నీ కావు. ఈ కాలుష్యం మన శరీరంలోని పలు అవయవాల మీద ప్రభావం చూపుతుంది కాలుష్యం వలన కలిగే అనర్థాల గురించి తెలిసినా బయట తిరగకుండా ఉండలేని పరిస్థితి. బయటకు వెళ్ళే సమయంలో ఈ కాలుష్యం బారిన పడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం శూన్యం.అసలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కాలుష్యం బారిన పడకుండా ఉండటం అసంభవం..కానీ ఇలా చేస్తే మటుకు కాలుష్య ప్రభావం పడదు పడినా మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. .

విటమిన్ “బి” ద్వారా కాలుష్యం బారినపడినా మనకి ఏమీ కాదట. చాలా మందికి “బి 12”, “బి” “జి” విటమిన్లు ఇచ్చిన అనంతరం వాయుకాలుష్యం అధికంగా ఉండే ప్రాంతానికి పంపించారు. అనంతరం వీరిని పరిశీలించగా వాయుకాలుష్యం వీరి జన్యువుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. అయితే బి విటమిన్‌ వాయుకాలుష్యం నుంచి రక్షణ కలిపిస్తుందన్న విషయం మొదటిసారి రుజువైంది.ఇప్పుడు మరింత పరిశోధనలు ఇదే అంశం మీద చేస్తున్నారు ఎలా అంటే ..”బి” తో పాటుగా రోగనిరోధక శక్తి పెంచేలా చేస్తున్నారు. సో ఇదే కనుక సక్సెస్ అయితే కాలుష్యం నుంచీ తప్పించుకోవడానికి మనిషికి ఒక అవకాశం దొరికినట్టే