విటమిన్ E మన శరీరానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?

మన శరీరానికి విటమిన్ E ఎంతో అవసరం.ఈ విటమిన్ మన శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపటంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

 Vitamin E Rich Foods Helpful Body E-TeluguStop.com

ఈ విటమిన్ లోపం కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.విటమిన్ E శరీరంలో బలమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి జీవక్రియ సరిగ్గా  జరిగేలా చేస్తుంది.

అంతేకాక ఎనిమిది రకాల వ్యర్ధాలను బయటకు పంపటంలో కీలక పాత్రను పోషిస్తుంది.ఇది కణాల చర్మాన్ని రక్షించటం ద్వారా చర్మం, గుండె, రక్తప్రసరణ, నరాలు, కండరాలు, ఎర్ర రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

అలాగే చర్మ ఆరోగ్యంలో కూడా కీలకంగా ఉంటుంది.

విటమిన్ E రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది.

అనేక చర్మ సమస్యలను సమర్ధ వంతంగా పరిష్కారం చేయటం వలన అనేక చర్మ రక్షణ క్రీమ్స్ లో వాడుతున్నారు.విటమిన్ E కణాలు త్వరగా చనిపోకుండా చేస్తుంది.

రోగనిరోధక శక్తిని బలపరచి క్యాన్సర్ కారకాలు పెరగకుండా చూడటమే కాకుండా క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది.

కళ్ళ మంటలు ,కాటారాక్ట్, అల్జీమర్ వ్యాధి, ఆస్తమా వంటి వాటికి విటమిన్ E సమృద్ధిగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.

మధుమేహం ఉన్నవారికి విటమిన్ E చాలా బాగా సహాయ పడుతుంది.రక్తంలో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది.

విటమిన్ E పచ్చని ఆకు కూరలు, బ్రక్కోలి, తోటకూర, పాలకూర, పండ్లులో మామిడిపండు, కమలాపండు వంటి వాటిలో చాలా ఎక్కువగా ఉంటుంది.ఈ ఆహారాలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచిది.

విటమిన్ E కాప్సిల్స్ కూడా అందుబాటులో ఉంటాయి.కానీ విటమిన్ E ని సహజసిద్ధంగా తీసుకుంటేనే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube