విటమిన్ డి తగ్గిందా? అయితే ఈ ఆహారాలు తప్పనిసరి   Vitamin D Rich Foods     2018-03-30   00:02:44  IST  Lakshmi P

మన శరీరంలో విటమిన్ డి సరైన మోతాదులో ఉంటే అనేక జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. విటమిన్ డి అనేది మనం తీసుకొనే ఆహారంలో కాల్షియం, పాస్ఫరస్‌లను మన శరీరం గ్రహించేలా చేస్తుంది. దీంతో ఎముకలు, దంతాలు, కండరాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. కానీ ఈ రోజుల్లో చాలా మందికి విటమిన్ డి సరైన మోతాదులో అందటం లేదు. అలాంటి వారు శరీరానికి విటమిన్ డి అందాలంటే ఎటువంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం.

ప్రతి రోజు ఉదయం 9 గంటల లోపు సూర్య రశ్మిలో 20 నుంచి 30 నిమిషాల పాటు శరీరానికి ఎండ తగిలేలా ఉండాలి. ఇలా ఉండటం వలన మన శరీరం ఆటోమేటిక్‌గా కొవ్వుల నుంచి విటమిన్ డిని తయారు చేసుకుంటుంది.

చీజ్‌లో విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది. చీజ్ తీసుకోవటం వలన శరీరానికి అవసరమైన కొవ్వు, కాల్షియంలు లభిస్తాయి.

పుట్టగొడుగుల్లోనూ విటమిన్ డి సమృద్ధిగానే ఉంటుంది. తరచుగా పుట్ట గొడుగులను ఆహారంలో భాగంగా చేసుకుంటే విటమిన్ డి లోపం నుండి బయట పడవచ్చు.

చేపల్లో విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది. వారంలో కనీసం రెండు నుంచి మూడు సార్లు చేపలను తింటే విటమిన్ డి లోపం నుండి బయట పడవచ్చు.

కోడిగుడ్లలో ఉండే పచ్చని సొనలో విటమిన్ డి సమృద్ధిగా దొరుకుతుంది. అయితే గుడ్లను ఉడకబెట్టుకుని తింటేనే విటమిన్ డి ప్రయోజనం కలుగుతుంది.

కొవ్వు తీయని పాలలోనూ విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది. పాలు తాగలేని వారు సోయాపాలు త్రాగినా విటమిన్ డి శరీరానికి అందుతుంది.