ఆ విటమిన్ లోపం ఉంటే 80 శాతం కరోనా ముప్పు?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతోంది.వైరస్ కు సంబంధించి శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో వైరస్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

 D Vitamin Deficiency Increase 80 Percnet Corona Risk, Vitamin D, Coronavirus, Ch-TeluguStop.com

విటమిన్ల లోపంతో బాధ పడే వారు ఎక్కువగా వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.గతంలో డి విటమిన్ లోపం ఉన్నవారు కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలగా తాజాగా డి విటమిన్ లోపం కరోనా ముప్పును 80 శాతం పెంచుతుందని వెల్లడైంది.

చికాగో యూనివర్శిటీ పరిశోధకులు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు.489 మంది రోగులపై మార్చి – ఏప్రిల్ నెలలలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ లో తాజాగా పరిశోధనలకు సంబంధించిన ఫలితాలు ప్రచురించబడ్డాయి.తగినంత డి విటమిన్ ఉన్న 300 మంది రోగులలో కేవలం 12 శాతం మంది కరోనా బారిన పడగా డి విటమిన్ లోపంతో బాధ పడే 25 శాతం మందిలో 22 శాతం మంది వైరస్ బారిన పడ్డారు.

అధ్యయన ఫలితాలను పూర్తిస్థాయిలో పరిశీలించి శాస్త్రవేత్తలు డి విటమిన్ లోపంతో బాధ పడేవారిలో కరోనా ముప్పు 80 శాతం పెరుగుతుందని తెలిపారు.

ప్రజలు కరోనా ముప్పును తగ్గించుకోవాలంటే తగిన స్థాయిలో డి విటమిన్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.డి విటమిన్ రోగ నిరోధక వ్యవస్థ పనితీరు విషయంలో కీలకంగా వ్యవహరిస్తుందని….

శ్వాసకోశ అంటువ్యాధుల ప్రమాదాన్ని డి విటమిన్ తగ్గిస్తుందని చికాగో యూనివర్సిటీ ప్రొఫెసర్ దేవిడ్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube