నిలుపు దోపిడీ: విటమిన్ సి మాత్రల ధరలకు రెక్కలు...!

ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో కరోనా వైరస్ నుంచి బయటపడేందుకు ప్రజలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇందులో భాగంగానే వైద్య నిపుణులు ప్రజలకు ఎక్కువగా ‘సి విటమిన్’ లభించే టాబ్లెట్లు తీసుకోవాలని తెలుపుతున్నారు.

 Vitam C, Tablets, Block Market, Medicine, Medical Store , Vitamin C Tablets Pric-TeluguStop.com

దీనితో ప్రజలు సి విటమిన్, డి విటమిన్లు ఉండే టాబ్లెట్లను మందుల షాప్ లో ఎక్కువగా కొనుక్కొని పోగు చేసుకుంటున్నారు.ఇక ప్రస్తుతం వాటికి ఉన్న డిమాండ్ తో వెంటనే వాటి ధరలను అమాంతంగా పెంచేస్తున్నాయి ఫార్మసీ కంపెనీలు.

ప్రస్తుతం ఉన్న ధరలతో ప్రజలు ఆ టాబ్లెట్ లను కొనుగోలు చేయాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఫార్మసీ మందుల షాపులు ఇలా దోచుకోవడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతుంది.
ఈ నేపథ్యంలో ప్రజలు రెగ్యులర్ గా అబ్బోట్ ఫార్మా కంపెనీ తయారు చేసిన లింకేయీ ‘సి విటమిన్’ టాబ్లెట్లు, అపెక్స్ కంపెనీ తయారు చేసిన జింకవిత్ టాబ్లెట్ లు చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు.చాలా రోజులుగా ప్రజలు వీటిని రెగ్యులర్ గా వాడడం మొదలుపెట్టారు.

అలాగే ముసలి వారు రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి డాక్టర్లు ఇవే చూపించి ఉపయోగించమని చెబుతున్నారు.కానీ కరోనా వైరస్ వచ్చిన తర్వాత రెగ్యులర్ మందులు అస్సలు కనిపించడం లేదు.

ఏ మందుల షాపు కి వెళ్ళినా కూడా ఒక్క టాబ్లెట్ కూడా స్టాక్ ఉండట్లేదు.ఉన్న కానీ, ఒక పది మాత్రమే ఉన్నాయని చెప్పి వాటి ధరలు కూడా అమాంతంగా పెంచేసి కావాలంటే తీసుకోండి లేదంటే వదిలేయండి అన్నట్లు మాట్లాడుతున్నారు కొందరు మందు షాపుల ఓనర్లు.

ఇక మరికొన్ని మందు షాపుల్లో అయితే మరో రకమైన దోపిడి కి పాల్పడుతున్నాయి.ఓ రకం మాత్రలు 22 రూపాయలకు లభించేవి.

కానీ, అలాంటి రకం మరొక కంపెనీ మందులు వాటి ధర 50 రూపాయల నుంచి వంద రూపాయల వరకు పెంచి అమ్ముతున్నారు.ఇక మరోవైపు జింకవిత్ కు బదులుగా అదే అక్షరాలతో అటూ ఇటూ ఉన్న ఒక టాబ్లెట్ మార్కెట్లోకి తెచ్చి వాటి ధర కూడా సాధారణ ధర కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువగా పెట్టి అమ్ముతున్నారు.

నిజానికి ఇది ఒక దోపిడి లాగే కనిపిస్తుందని ప్రజలు వాపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube