కరోనా ప్రభావం: విమాన సర్వీసులు రద్దు,జర్మనీ లోనే చిక్కుకున్న ఛాంపియన్

కరోనా ప్రభావం ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తున్న విషయం తెలిసిందే.ఎక్కడో చైనా లో మొదలైన ఈ కరోనా వైరస్ నిదానంగా ప్రపంచ దేశాలకు పాకిన విషయం విదితమే.

 Viswanathan Anand Unable To Leave Germany Due To Covid 19-TeluguStop.com

ఈ కరోనా ప్రభావం తో ఒక్క చైనా లోనే మూడు వేల మందికి పైగా మృతి చెందగా, ప్రపంచ వ్యాప్తంగా 5 వేలకు పైగా మరణాలు నమోదు అయ్యాయి.చైనా తరువాత ఇటలీ,యూరోప్,ఇరాన్ లలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండగా మిగిలిన దేశాల్లో కూడా ఈ కరోనా ప్రభావం తీవ్రతరం అవుతుంది.

ఈ క్రమంలోనే యూరప్ దేశం జర్మనీ లో కూడా కరోనా పంజా విసరడం తో ఆ దేశంలో హైఅలర్ట్ ప్రకటించారు.దీనితో ప్రజలు వాళ్ల ఇళ్లకే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది.

విమాన సర్వీసులు కూడా రద్దు అవ్వడం తో అక్కడ నుంచి ఎవరూ కూడా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.అయితే జర్మనీ లోని బుండెస్లీగా లో చెస్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు వెళ్లిన ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ జర్మనీ లోనే చిక్కుకున్నట్లు తెలుస్తుంది.

అక్కడ విమాన సర్వీసులు రద్దు చేయడం తో ఆనంద్ తిరిగి స్వదేశానికి రావడానికి అవాంతరాలు ఎదురయ్యాయి.

Telugu Chess, Germany-Latest News - Telugu

దీనితో ఆయన పరిస్థితి కొంచం సర్దుకొనే వరకు ఆయన జర్మనీ లోనే ఉండిపోతారా లేదంటే మరి భారత్ చొరవ తో ఏవైనా చర్యలు చేపడుతుందా అన్న దానిపై క్లారిటీ లేదు.మరోపక్క ఆనంద్ భార్య అరుణ మాట్లాడుతూ ఆయన ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నానని, అయితే కరోనా మరింత విస్తరించకుండా ఇలా విమాన సర్వీసులను రద్దు చేయడం మంచి అంశమే అంటూ ఆమె అన్నారు.మరి విశ్వనాథ్ ఆనంద్ తిరిగి ఎప్పుడు స్వదేశానికి వస్తారు అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube