తెలుగమ్మాయి నందితా హీరోయిన్ గా అశుతోష్ రానా, ప్రసన్న లాంటి స్టార్ కాస్టింగ్ తో రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విశ్వామిత్ర.గీతాంజలి సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాలుగో సినిమా ఇది కావడం విశేషం.
ఇక తన గత సినిమాల తరహాలోనే ఓ ఇంటరెస్టింగ్ పాయింట్ తో థ్రిల్లర్ కాన్సెప్ట్ గా విశ్వామిత్ర సినిమాని దర్శకుడు తెరకెక్కించాడు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని చిత్ర దర్శక, నిర్మాత రాజ్ కిరణ్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు.
ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే వుంటే ఎవరో గుర్తు తెలియని ఓ అజ్ఞాత వ్యక్తి హీరోయిన్ నందితకి సాయం చేస్తూ, ఆమెని ప్రమాదాల నుంచి కాపాడుతూ ఉంటాడు.అయితే ఆమెని కాపాడుతున్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరనేది ఎవరు చెప్పలేరు.
నందితా అదే విషయం పోలీసులకి తెలియజేసిన వారు కూడా నమ్మరు.ఇలాంటి ఓ ఇంటరెస్టింగ్ పాయింట్ తో, థ్రిల్లర్ ఎలెమెంట్స్ తో కథని దర్శకుడు రాజ్ కిరణ్ నడిపించినట్లు తెలుస్తుంది.
మరి ఈ సినిమా హీరోయిన్ నందిత కి ఎంత వరకు సక్సెస్ ఇస్తుంది అనేది చూడాలి.