విశ్వక్ సేన్ వెనక్కి తగ్గాడా..!

సంక్రాంతి ఫైట్ ముగిసింది అనుకుంటుండగా రాబోయే శివరాత్రికి మరోసారి బాక్సాఫీస్ దగ్గర సినిమాల ఫైట్ ఉంటుందని తెలుస్తుంది.ఇప్పటికే సినిమాలన్ని ఫిబ్రవరి 17న రిలీజ్ డేట్ ప్రకటించాయి.

 Viswak Sen Dhamki Release Postpone  , Viswak Sen  , Dhamki , Dhamki Release  , P-TeluguStop.com

అందులో క్రేజీ ప్రాజెక్ట్ శాకుంతలం కూడా ఉంది.దీనితో పాటుగా ధనుష్ సార్ సినిమా వస్తుంది.

వీరితోనే విశ్వక్ సేన్ దాస్ కా ధంకీ రావాల్సి ఉంది.ఫిబ్రవరి 17న ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నాడు విశ్వక్ సేన్.

కానీ బాక్సాఫీస్ దగ్గర విపరీతమైన పోటీ ఉన్న కారణంతో అతను తన సినిమా రిలీజ్ వాయిదా వేసుకున్నట్టు టాక్.అఫీషియల్ గా చెప్పలేదు కానీ దాస్ కాద ధంకీ సినిమా దాదాపు పోస్ట్ పోన్ అయినట్టే అని తెలుస్తుంది.

విశ్వక్ సేన్ నటించడమే కాదు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది.సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజై సినిమాపై ఆసక్తి పెంచింది.

విశ్వక్ సేన్ ధంకీ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా మీద విశ్వక్ సేన్ చాలా నమ్మకంగా ఉన్నాడు.

అందుకే సోలోగా వచ్చి సూపర్ హిట్ కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube