అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవాళ్లు సైతం వేర్వేరు కారణాల వల్ల ప్రస్తుతం అనుకున్న లక్ష్యాలను సాధించే విషయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు.ప్రస్తుత పోటీ ప్రపంచంలో రేయింబవళ్లు తీవ్రస్థాయిలో శ్రమిస్తే మాత్రమే లక్ష్యాలను సాధించడం సాధ్యమవుతుంది.
కొంతమంది రాంగ్ రూట్ లో ఉద్యోగాలను సాధిస్తుండటంతో అన్ని అర్హతలు ఉన్నవాళ్లకు సైతం కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు రావడం లేదు.
అయితే ఇద్దరు యువతులు మాత్రం తమకు కళ్లు లేకపోయినా కెరీర్ పరంగా సక్సెస్ సాధించి వార్తల్లోకెక్కారు.
లక్ష్యాన్ని సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ యువతుల గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు.సిమ్లా( Shimla ) జిల్లాకు చెందిన ముస్కాన్ ( Muskan )పుట్టుకతోనే అంధురాలు కాగా ప్రభుత్వ బాలికల పాఠశాలలో సెకండరీ విద్యను ఆమె పూర్తి చేశారు.

మ్యూజిక్ లో ప్రవేశం ఉన్న ముస్కాన్ కు బాల్యంలో కళ్లు లేవని తోటి వాళ్ల నుంచి వెక్కిరింపులు ఎదురయ్యాయి.అయితే ఆ కామెంట్లను పట్టించుకోకుండా ఆమె కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకున్నారు.ప్రస్తుతం ముస్కాన్ ఆర్.కే.ఎం.వీ యూనివర్సిటీలో మ్యూజిక్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.అంధురాలైన మరో యువతి ప్రతిభా ఠాకూర్( Pratibha Thakur ) కు ఒక విద్యా సంస్థలో ప్రవేశానికి నిరాకరణ ఎదురైంది.

తనకు ఏ విద్యాసంస్థలో ప్రవేశానికి నిరాకరణ ఎదురైందో అదే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఆమె పని చేస్తున్నారు.మండీ జిల్లాలోని మతక్ కు చెందిన ప్రతిభా ఠాకూర్ పొలిటికల్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.రాజీవ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో ఆమె ప్రొఫెసర్ గా పని చేస్తున్నారని తెలుస్తోంది.
వీళ్లిద్దరూ తమ టాలెంట్ తో కెరీర్ పరంగా ఎదిగిన తీరు అద్భుతమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.