తెలంగాణ సచివాలయంలో కోవిడ్ ఆంక్షలు..!!

తెలంగాణలో భారీగా కరోనా కేసులు బయట పడుతున్న సంగతి తెలిసిందే.దీంతో గాంధీ హాస్పిటల్ అదేవిధంగా రాష్ట్రంలో మరికొన్ని హాస్పిటల్స్ లో రోగులకు బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది.

 Visitors No Entry In Telangana Secretariat Due To Covid Effect Telangana Secreta-TeluguStop.com

దీంతో మహమ్మారిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో విద్యాసంస్థలను క్లోజ్ చేసి రాత్రిపూట నైట్ కర్ఫ్యూ విధించటం మాత్రమేకాక బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా కనిపిస్తే వెయ్యి రూపాయల జరిమానా కూడా విధిస్తున్నారు.

అయినా కానీ పరిస్థితి అదుపులోకి రాని క్రమంలో మరో పక్క ప్రభుత్వ అధికారులు కూడా కరోనా బారిన పడుతూ ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం సచివాలయంలో కోవిడ్ ఆంక్షలు విధించింది.

కేసులు పెరుగుతూ ఉండటంతో తాజాగా సర్క్యులర్ జారీ చేస్తూ విజిటర్స్ ఎవరు సచివాలయం లోకి రాకుండా ఆంక్షలు విధించింది.దీంతో తాత్కాలిక పాసులు నిలిపివేసింది. ఈ విధంగా దాదాపు 15 రోజుల పాటు తెలంగాణ సచివాలయంలో విజిటర్స్ ఎవరు రాకుండా భద్రతా ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం.ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల 70 వేలకు పైగానే కేసులు నమోదు అయ్యాయి.

ఈ కేసులో చాలామంది రికవరీ అవగా ప్రస్తుతం రాష్ట్రంలో 50 వేలకు పైగా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube