ఇక తాజ్‌ను ముట్టుకునే వీలులేదు  

Visitors May Not Be Allowed To Touch Taj Mahal -

ప్రపంచంలోని మానవ నిర్మిత అద్భుతాల్లో ఒకటైన ‘ప్రేమ చిహ్నం’ తాజ్‌మహల్‌ను సందర్శకులు ఇకమీదట ముట్టుకునేందుకు వీలులేదు.తాజ్‌ను ప్రతి రోజు వేలాది మంది సందర్శిస్తుంటారు.

విదేశాల నుంచి కూడా ఎంతోమంది వస్తుంటారు.భారత్‌కు వచ్చిన సాధారణ పర్యాటకులైనా, విఐపీలైనా సరే తాజ్‌ను చూడకుండా, చూసి పరవశించకుండా వెళ్లరు.

Visitors May Not Be Allowed To Touch Taj Mahal-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే రోజూ వేలాదిమంది తాజ్‌ చూస్తూ దాన్ని ముట్టుకొని ఆనందపడుతుండటంతో దాని ‘పాల తెలుపు’ వన్నె తగ్గిపోతున్నదనే అభిప్రాయం కలుగుతోంది.వేలాదిమంది చేతులు దాని మీద పడుతుండటంతో అది మాసిపోతోందని పురావస్తు శాఖ నిపుణులు భావిస్తున్నారు.

దీంతో తాజ్‌ను చూడటంవరకే పరిమితం చేయాలని, ముట్టుకోకుండా చేయాలని నిర్ణయించారు.దీంతో దాని చుట్టూ చెక్క, గ్లాస్‌ కలిపి బ్యారికేడ్స్ ఏర్పాటు చేస్తున్నారు ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు.

మరో నాలుగు నెలల తరువాత ఎవరు కూడా ఈ పాలరాతి నిర్మాణాన్ని తాకేందుకు అవకాశం లేదు.తాజ్‌ను తాకకుండా చేసే పని కోసం సుమారు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

ఇప్పటివరకు తాజ్‌ను ముట్టుకొని, పరవశించి ‘వాహ్‌…తాజ్‌’ అంటూ మురిసిపోయినవారు ధన్యులు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test