కన్ఫ్యూజ్ చేస్తున్న విశ్వేశ్వర్ రెడ్డి.. ఎటువైపో తెలియట్లేదే..?

తెలంగాణ రాజకీయాలు చాలా గమ్మత్తుగా ఉంటున్నాయి.ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు.

 Vishweshwar Reddy Is Confusing Dont Know Which Political Party He Is Going To Su-TeluguStop.com

ఇక ఓ కీలక నేత అయితే ఆయన మార్క్ రాజకీయాలతో చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారని చెప్పాలి.ఆయనెవరో కాదండోయ్ కాంగ్రెస్ లో కీలకంగా పనిచేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

ఆయన కాంగ్రెస్ గూటిని వీడిన సంగతి తెలిసిందే.అయితే రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత ఆయన్ను కలిసి కాంగ్రెస్ లోకి రావాలంటూ ఆహ్వానించారు.

కానీ ఆయన మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా కాంగ్రెస్ ను సపోర్టు చేస్తున్నట్టు కనిపించినా కూడా మరోవైపు అధికార పార్టీవైపు కూడా ఉంటున్నట్టు తెలుస్తోంది.

అయితే ఆయన ఓ సారి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మరోసారి టీఆర్ ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.

ఇంకోసారి అయితే బీజేపీ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు.దీంతో అసలు ఆయన ఏ పార్టీలో ఉంటున్నారో ఎవరికి అనుకూలంగా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు.2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన తర్వాత ఆయన ఓడిపోయిన విషయం కూడా అందరికీ తెలిసిందే.ఇక అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉంటున్నారు.

ఇక కాంగ్రెస్ కు ఆయన రీసెంట్ గానే రిజైన్ కూడా చేశారు.ఆ తర్వాత రేవంత్ రెడ్డి హయాంలో మళ్లీ కాంగ్రెస్ గూటికి వస్తానని, ఆ తర్వాత తీన్మార్ మల్లన్నతో ముందుకు వెళ్తానని, ఇంకోసారి సొంతంగా పార్టీ పెడుతానంటూ ప్రకటించారు.

Telugu Bandi Sanjay, Telangana-Telugu Political News

ఇప్పుడేమో ఏ పార్టీలో చేరకపోయినా కూడా రేవంత్ కు కొంత సపోర్టుగానే ఉంటున్నారు.కానీ కాంగ్రెస్ లో మాత్రం తాను అస్సలు చేరబోనంటూ చెప్పేశారు.ఇక్కడే ఆయన బీజేపీతో కూడాసన్నిహితంగా ఉండటం సంచలనం రేపుతోంది.ఈటల రాజేందర్ గెలవాలంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పేస్తున్నార.ఇలా చాలా రకాల మాటలతో అసలు ఆయన ఏ పార్టీలో ఉంటున్నారో ఎవరికీ అర్థం కాకుండా చేస్తున్నారు.ఇంకోవైపు బండి సంజయ్ కు వైట్ ఛాలెంజ్ విసరడం కూడా సంచలనం రేపుతోంది.

చూడాలి మరి ఆయన ఏ పార్టీలో చేరుతారో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube