నేను అలా చేయడంతో విశ్వనాథ్ గారికి చాలా కోపం వచ్చింది: జయసుధ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కళాతపస్వి కే విశ్వనాధ్ గారు గత కొద్దిరోజుల క్రితం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన విషయం మనకు తెలిసిందే.ఇలా కళాతపశ్వి కే విశ్వనాథ్ గారు మరణించడం చిత్ర పరిశ్రమకు తీరనిలోటు అని చెప్పాలి.

 Vishwanath Got Very Angry When I Did That Jayasudha ,vishwanath , Jayasudha ,to-TeluguStop.com

విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.అయితే ఈయన మరణించిన తర్వాత ఫిబ్రవరి 19వ తేదీ ఆయన జయంతి కావడంతో ఆయనని స్మరించుకుంటూ హైదరాబాదులో కళాంజలి పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇతర నటీనటులు కూడా పాల్గొన్నారు.ఈ క్రమంలోనే సహజ నటి జయసుధ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కళాతపస్వికే విశ్వనాథ్ గారితో తనకు ఉన్నటువంటి అనుబంధం గురించి ఈ సందర్భంగా జయసుధ తెలియజేశారు.

ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ ఎన్నో క్లాసికల్ సినిమాలు చేసిన విశ్వనాథ్ గారికి కమర్షియల్ సినిమాలు చేయాలనిపించింది.ఈ క్రమంలోని ఆయన దర్శకత్వంలో కాలాంతకులు, అల్లుడు పట్టిన భరతం వంటి కమర్షియల్‌ చిత్రాలలో నేను నటించానని జయసుధ తెలిపారు.

Telugu Jayaprada, Jayasudha, Kamal Haasan, Chiranjeevi, Sagara Sangam, Tollywood

ఇక విశ్వనాధ్ గారి దర్శకత్వంలో వచ్చిన సాగర సంగమం సినిమాలో నిజానికి జయప్రద స్థానంలో తానే నటించాల్సి ఉంది.ఈ సినిమా కోసం ఏడిద నాగేశ్వరరావు గారు ముందుగా నన్ను సంప్రదించి నాకు కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చారు.అయితే ఈ సినిమా అనుకున్న సమయం కన్నా కాస్త ఆలస్యమైంది.కమల్ హాసన్ గారు బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో తాను కూడా ఎన్టీఆర్ గారితో సినిమా చేయడం వల్ల ఈ సినిమా అవకాశాన్ని కోల్పోయానని తెలిపారు.

Telugu Jayaprada, Jayasudha, Kamal Haasan, Chiranjeevi, Sagara Sangam, Tollywood

ఇలా ఈ సినిమాలో నటించే అవకాశం కోల్పోవడంతో ఈ సినిమాకు నేను తీసుకున్నటువంటి అడ్వాన్స్ తిరిగి వెనక్కి ఇచ్చాను.ఇలా అడ్వాన్స్ తిరిగి ఇవ్వడంతో విశ్వనాథ గారు నాపై చాలా కోపడ్డారని కొన్ని రోజులపాటు ఆయన తనతో మాట్లాడలేదని ఈ సందర్భంగా జయసుధ గుర్తు చేసుకున్నారు.చాలా రోజుల తర్వాత ఓసారి నేను విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు నాతో నటిస్తావా?’ అని అడిగారు.అదే ఆయనతో తన చివరి మాటలు అని జయసుధ ఈ సందర్భంగా గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube