రౌడీని అనవసరంగా కెలికిన దాసు... సారీ చెప్పినా చావగొడుతూనే ఉన్నారు

విజయ్‌ దేవరకొండకు ప్రస్తుతం విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.విజయ్‌ దేవరకొండ స్టార్‌ డం ఏ స్థాయిలో ఉందో ఆయన సినిమా వసూళ్లను బట్టి అర్థం చేసుకోవచ్చు.

 Vishwaksen Comments On Vijaydevarakonda Fans-TeluguStop.com

ఇక సోషల్‌ మీడియాలో చిన్న కామెంట్‌ చేసినా కూడా విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ దాన్ని ఏ స్థాయిలో వైరల్‌ చేస్తారో కూడా మనకు తెలిసిన విషయమే.అంతటి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ను ఫలక్‌నుమా దాస్‌ హీరో విశ్వక్‌సేన్‌ కెలకడం చర్చనీయాంశం అయ్యింది.

ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ‘ఫలక్‌నుమా దాస్‌’ ప్లెక్సీలు చించేయడంతో పాటు, సోషల్‌ మీడియాలో బ్యాడ్‌ కామెంట్స్‌ పెడుతూ సినిమాపై నెగటివ్‌ ప్రచారం చేస్తున్నారు.సినిమా గురించి నెగటివ్‌ ప్రచారం చేస్తున్న వారే ప్లెక్సీలు చించారు అంటూ విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ గురించి విశ్వక్‌సేన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

నేరుగా రౌడీ పేరు చెప్పక పోయినా కూడా ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలా విజయవాడలో ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ ఏకి పారేశాడు.దాంతో తీవ్రమైన విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

రౌడీని అనవసరంగా కెలికిన దాసు

ఒక్క సినిమాకే నువ్వు పెద్ద తోపు హీరోవు అనుకుంటున్నావా అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ పెద్ద ఎత్తున వస్తున్నాయి.దాంతో మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తాను ఎవరిని కించ పర్చే విధంగా అనలేదు, ఎవరినో అంటే మీరు ఎందుకు రోషంకు వస్తున్నారు, లక్షలు ఖర్చు పెట్టి పెట్టించిన ప్లెక్సీలు చించేస్తే పరిస్థితి ఏంటీ, కోపం రాకుండా ఉంటుందా.వారిని మేము తిడితే మీకు ఎందుకు ఇంత కోపం వస్తుందంటూ విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ను విశ్వక్‌ సేన్‌ ప్రశ్నించాడు.క్షమాపణలు చెప్పినా కూడా ఇంకా విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో విశ్వక్‌ సేన్‌ను ఫుల్‌గా టార్గెట్‌ చేసి ఆట ఆడేసుకుంటున్నారు.

ఈ వివాదం ఎప్పటికి సర్దుమనిగేనో అర్థం కావడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube