విశ్వక్ సేన్ ‘పాగల్‌’కు పిచ్చికుదిరినట్లేనా?

టాలీవుడ్‌లో ఒక్కసినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగిన వారు చాలామందే ఉన్నారు.వారిలో ఈ జెనరేషన్‌లో చెప్పుకోదగ్గ పేరు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అని చెప్పాలి.

 Vishwak Sen Trolled For Paagal Movie, Vishwak Sen, Paagal, Tollywood News, Paaga-TeluguStop.com

పెళ్లిచూపులు సినిమాతో ప్రేక్షకుల కళ్లల్లో పడ్డ ఈ హీరో, ఆ తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ కొట్టేశాడు.ఈ ఒక్క సినిమాతో మనోడి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.

అయినా కూడా ఏదైనా సినిమా చేసినప్పుడు దానికి సంబంధించిన ఈవెంట్స్‌లో అతిగా మాట్లాడి అభాసుపాలు మాత్రం కాడు.ఈ అలవాటుతోనే మనోడు ఇంకా చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

అయితే ఇదే కోవలో మరో యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా దూసుకువచ్చాడు.తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది చిత్రంతో తెరంగేట్రం చేసిన విశ్వక్ సేన్, ఆ తరువాత ఫలక్‌నుమా దాస్ చిత్రంతో అదిరిపోయే రేంజ్ అందుకోవాలని ప్రయత్నించాడు.

అయితే సినిమా పరంగా మాస్ ఆడియెన్స్‌ను ఫుల్‌గా మెప్పించిన ఈ హీరో, ఆ సినిమాతో అనుకున్న స్థాయిలో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు.ఇక తాజాగా పాగల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో, ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చేసిన స్పీచ్ సర్వత్రా విమర్శలకు దారితీసింది.

కరోనా తరువాత పాగల్ చిత్రంతోనే థియేటర్లు తెరుచుకుంటున్నాయని, అందుచేత ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని, అలా కాని పక్షంలో తన పేరు మార్చుకుంటానని గొప్పలు చెప్పుకొచ్చాడు.

గతంలో కూడా ఇలాంటి ధోరణిలో మాట్లాడి పలు విమర్శలు ఎదుర్కొన్నాడు ఈ హీరో.

అయితే నేడు(ఆగస్టు 14) పాగల్ చిత్రం రిలీజ్ కావడం, దానికి దారుణమైన టాక్ రావడంతో విశ్వక్ సేన్ ఓవర్‌యాక్షన్ తగ్గించుకుంటేనే మంచిదని చాలా మంది హితవు పలుకుతున్నారు.తనను తాను ఎలివేట్ చేసుకునే బదలు సినిమా కంటెంట్‌ను నమ్ముకుంటేనే సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరని పలువురు ఆయనకు సూచిస్తున్నారు.

మరి పాగల్ దెబ్బకు మనోడి పిచ్చి కుదిరినట్లేనా అని సినీ విమర్శకులు ఎద్దేవా చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube