తంబ్‌నెయిల్ మార్చకపోతే డైరెక్ట్ గా నీ ఇంటికి వస్తా.. యూట్యూబ్ ఛానెల్‌‌ కు విశ్వక్ సేన్ వార్ణింగ్..- Vishwak Sen Strong Warning On Youtube Channel Over Video Thumbnail

vishwak sen strong warning on youtube channel over video thumbnail,video thumbnail,vishwak sen,nandita swetha,youtube - Telugu Nandita Swetha, Video Thumbnail, Vishwak Sen, Youtube

రోజురోజుకూ యూట్యూబ్ లో కొన్ని ఛానెల్స్ దారుణంగా వక్రీకరించి రాస్తున్నాయి.వాళ్ళు పెట్టే వీడియోలో ఉండే మ్యాటర్ ఒకటైతే, పైన పెట్టే తంబ్‌ నెయిల్ మరొకటి ఉంటుంది.

 Vishwak Sen Strong Warning On Youtube Channel Over Video Thumbnail-TeluguStop.com

తంబ్‌నెయిల్ ఎంత ఇంట్రెస్ట్ గా ఉంటే అంత మంది చూస్తారని అలా పెడుతున్నారు.కానీ కొన్ని ఛానెల్స్ మాత్రం మరీ ఘోరంగా పెడుతున్నాయి.

ఆడవాళ్లు అని కూడా చూడకుండా ఏది తోస్తే అది రాస్తున్నారు.

 Vishwak Sen Strong Warning On Youtube Channel Over Video Thumbnail-తంబ్‌నెయిల్ మార్చకపోతే డైరెక్ట్ గా నీ ఇంటికి వస్తా.. యూట్యూబ్ ఛానెల్‌‌ కు విశ్వక్ సేన్ వార్ణింగ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా విశ్వక్ సేన్ గురించి హీరోయిన్ నందితా శ్వేత మాట్లాడిన మాటలను ఒక యూట్యూబ్ ఛానెల్ వక్రీకరించి రాసింది.

ఆమె మాట్లాడని మాటలను ఆ వీడియో తంబ్‌నెయిల్ లో పెట్టారు.ఈ విషయంపై విశ్వక్ సేన్ సీరియస్ అయ్యాడు.దీనిపై ఆ యూట్యూబ్ ఛానెల్ కు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్ణింగ్ ఇచ్చాడు.

ఆదివారం రోజు అక్షర సాంగ్ లాంచ్ జరిగింది.

ఈ ఈవెంట్ కు విశ్వక్ సేన్ ముఖ్య అతిధిగా వచ్చాడు.అక్షర సాంగ్ ను విడుదల చేసాడు.

తర్వాత హీరోయిన్ నందితా శ్వేతా మాట్లాడింది.విశ్వక్ సేన్ ముఖ్య అతిధిగా రావడం వల్ల తమ సినిమాకు హైప్ వచ్చిందని అన్నారు.

అయితే ఒక యుట్యూబ్ ఛానెల్ ఈ వీడియోను వక్రీకరించి రాసింది.ఆ వీడియో కోసం ఆ యూట్యూబ్ ఛానెల్ ఉపయోగించిన తంబ్‌నెయిల్ గలీజుగా ఉందంటూ విశ్వక్ సేన్ ఒక వీడియో విడుదల చేసాడు.ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.ఆ అమ్మాయి ఈ వీడియో చూసిందో లేదో నాకు తెలియదు.మీరు రాసింది చాలా గలీజుగా ఉంది.మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది.

అందులో ఆడవారు కూడా ఉన్నారు.మన ఇంట్లో వాళ్ళను కూడా ఎవరైనా ఆలా మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది.

నీకు మనసులో వాళ్ళ గురించి కూడా ఇలానే ఆలోచిస్తున్నావు కాబట్టే నీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంటూ.24 గంటలలోగా నువ్వు క్షమించమంటూ ఒక వీడియో తీసి పెట్టకపోతే మీ ఇల్లు ఎక్కడ ఉన్న వెతుక్కుంటూ వచ్చి నేనే వీడియో పెట్టిస్తా అని ఆ యూట్యూబ్ ఛానల్ కు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్ణింగ్ ఇచ్చాడు.

#Youtube #Nandita Swetha #Vishwak Sen #Video Thumbnail

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు