మన తల్లి, అక్క హీరోయిన్స్ అంటున్నతెలంగాణ హీరో

తెలంగాణ నుంచి విజయ్ దేవరకొండ తర్వాత హీరోగా వరుస సినిమాలు చేస్తున్న కుర్ర నటుడు విశ్వక్ సేన్.ఈ నగరానికి ఏమైంది సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ తాజాగా హిట్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు.

 Vishwak Sen Says Mother And Sister Is My First Heroins-TeluguStop.com

ప్రస్తుతం పాగల్ అనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఇక మంచి క్రేజ్ తో దూసుకుపోతున్న విశ్వక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.

నాకు కోపిష్టి అని అందరూ అనుకున్న ఎక్స్నేకువగా ఫ్రెండ్ షిప్ కి ప్రాధాన్యత ఇస్తా.ఈ గుణం నాకు అమ్మ నుంచి వచ్చింది.

మా అమ్మ నాకు ఊహ వచ్చినప్పటి నుంచీ ఇప్పటిదాకా రోజూకు మినిమంగా పాతికమందికి అన్నం పెట్టకుండా చూసింది లేదు.అలాగే నేను భయపడే వ్యక్తి మా అక్క.

నేను ఏ విషయం అయిన అదుపు తప్పితే కంట్రోల్‌లో పెడుతుంది.

ఫలక్‌నుమా దాస్‌ నేను సొంతంగా నిర్మించా.

ఆ సినిమాకి అమ్మ, అక్క కాస్ట్యూమ్‌ డిజైనర్స్‌‌గా పని చేశారు.వారు ఉపయోగించిన కాస్ట్యూమ్స్ విషయంలో ముంబయి హీరోయిన్‌కి కాస్త అతి చేసింది.

దీంతో కోపంతో ఆమెని వెంటనే సినిమా నుంచి తొలగించడం జరిగింది.నా జీవితంలో అమ్మా, అక్కా అసలైన హీరోయిన్స్‌.

వాళ్లు చేసిందాంట్లో వంకలు పెడితే ఊరుకునే ప్రసక్తే లేదు.వారు ఫైనల్ అన్నారంటే అవి ఫైనల్ అనే.అందులో ఎలాంటి మార్పు ఉండదు అంటూ తన లైఫ్ లో తల్లికి, అక్కకి ఎంత ప్రాధాన్యత ఇస్తాను అనే విషయంలో స్పష్టం చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube