వరుస సినిమాలు చేస్తూ తన హవా చూపిస్తున్న విశ్వక్ సేన్ !

తెలుగులో ప్రస్తుతం కుర్ర హీరోల హవా బాగా సాగుతుంది.వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నారు.

 Vishwak Sen Romance With Four Heroines With Continuous Movie Offers, Vishwak Sen-TeluguStop.com

అందులో విశ్వక్ సేన్ కూడా ఒకరు.ఈయన చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్స్ అవ్వడంతో ఇంకా వెను తిరిగి చూసుకోవడం లేదు.

ఈయన వెళ్ళిపోమాకే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు.ఆ తర్వాత చేసిన ఈ నగరానికి ఏమైంది సినిమాతో మొదటి హిట్ అందుకున్నాడు.

ఈయన డైరెక్టర్ గా కూడా హిట్ అందుకున్నాడు.విశ్వక్ సేన్ ఫలక్ నుమా దాస్ సినిమాతో డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు.ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యి యూత్ లో మంచి ఫాలోయింగ్ వచ్చింది.ఆ తర్వాత వచ్చిన ‘హిట్‘ సినిమా కూడా తన సక్సెస్ కొనసాగించాడు.

ఈ సినిమా తర్వాత విశ్వక్ వరస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తన హవా చూపిస్తున్నాడు.

ప్రస్తుతం విశ్వక్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి.

నరేష్ అనే కొత్త డైరెక్టర్ తో ‘పాగల్‘ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Telugu Kappela, Alvijay, Falaknuma Das, Kadavule, Pagal, Romance, Vellipomake, V

అంతేకాదు ఈయన మరొక రెండు రీమేక్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.ఓ మై కడవులే అనే తమిళ్ రీమేక్ తో పాటు, కప్పేలా అనే మలయాళం రీమేక్ లో కూడా నటిస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా విశ్వక్ ఒక స్టార్ డైరెక్టర్ తో హారర్ మూవీ చేస్తున్నాడని ఆ సినిమా షూటింగ్ కూడా 90 శాతం పూర్తి అయ్యిందని వార్తలు వస్తున్నాయి.

Telugu Kappela, Alvijay, Falaknuma Das, Kadavule, Pagal, Romance, Vellipomake, V

అంతేకాదు ‘లేడీస్ నైట్‘ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.ఈ సినిమాను ఏ ఎల్ విజయ్ తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో విశ్వక్ ఏకంగా నలుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయబోతున్నాడట.మేఘా ఆకాష్, నివేతా పేతురాజ్, రెబ్బా మౌనిక జాన్, మంజి మమోహన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారట.

మొత్తానికి కుర్ర హీరో మంచి జోరు మీద ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube