రెండు రోజుల్లో పిల్లను వెతికిపెట్టండి.. హీరో విశ్వక్ సేన్ కామెంట్స్ వైరల్

Vishwak Sen Request Help Allam Find Pellam Ashoka Vanamlo Arjuna Kalyanam Movie

తక్కువ సినిమాలే చేసినా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు.తన సినిమాలలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా జాగ్రత్త పడుతున్న విశ్వక్ సేన్ గత సినిమా పాగల్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.

 Vishwak Sen Request Help Allam Find Pellam Ashoka Vanamlo Arjuna Kalyanam Movie-TeluguStop.com

ఫలక్ నుమా దాస్, హిట్ సినిమాలతో విజయాలను అందుకున్న విశ్వక్ సేన్ పాగల్ ఫలితంతో నిరాశ చెందారు.అయితే ఈ హీరో తన కొత్త సినిమాను మాత్రం వెరైటీగా ప్రమోట్ చేసుకుంటుకుంటున్నారు.

విశ్వక్ సేన్ హీరోగా అశోకవనంలో అర్జున కళ్యాణం పేరుతో ఒక సినిమా తెరకెక్కుతోంది.కొన్నిరోజుల క్రితం పెళ్లి కొరకు చింతా మ్యారేజ్ బ్యూరోను సంప్రదించానని విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఆ ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

 Vishwak Sen Request Help Allam Find Pellam Ashoka Vanamlo Arjuna Kalyanam Movie-రెండు రోజుల్లో పిల్లను వెతికిపెట్టండి.. హీరో విశ్వక్ సేన్ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా విశ్వక్ సేన్ రెండు రోజుల సమయం మాత్రమే ఉందని పిల్లని వెతికిపెట్టాలని ఒకవేళ పిల్లను వెతికిపెట్టడం సాధ్యం కాకపోతే కనీసం అమ్మాయిని పడేసే చిట్కాలు అయినా ఇవ్వాలని ట్వీట్ లో పేర్కొన్నారు.

#helpallamfindpellam హ్యాష్ ట్యాగ్ తో సూచనలను తెలియజేయాలని విశ్వక్ సేన్ పోస్ట్ లో చెప్పుకొచ్చారు.

వయస్సు మూడు పదులు దాటేసిందని జుట్టు, పొట్ట ఇలా అనేక కష్టాలు ఉన్నాయని ఒక్క సంబంధం చూసి అల్లానికి పెళ్లాన్ని వెతికిపెట్టడంలో సాయం చేయాలని విశ్వక్ సేన్ ట్వీట్ తో పాటు షేర్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చారు.విశ్వక్ సేన్ ప్రమోషన్స్ సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతాయో చూడాల్సి ఉంది.

ఈ నెల 15వ తేదీన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందని విశ్వక్ సేన్ చెప్పకనే చెప్పేశారు.ఈ సినిమా నుంచి సంక్రాంతి కానుకగా టీజర్ లేదా ట్రైలర్ రిలీజయ్యే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.బాపినీడు సుధీర్ ఈదర ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Video : Vishwak Sen Request Help Allam Find Pellam Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Details, Vishwak Sen Latest Movie, #helpallamfindpellam, Hero Vishwak Sen, Tollywood, Bapineedu Sudhher, Bride, Ashoka Vanamlo Arjuna Kalyanam

vishwak sen request help allam find pellam ashoka vanamlo arjuna kalyanam movie details, vishwak sen latest movie, #helpallamfindpellam, hero vishwak sen, tollywood, bapineedu sudhher, bride, ashoka vanamlo arjuna kalyanam - Telugu Ashokavanamlo, Vishwak Sen, Tollywood

#Vishwak #AshokaVanamlo #Vishwak #AshokaVanamlo #Vishwak

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube