కథ నచ్చితే విలన్ గా అయినా ఒకే అంటున్న విశ్వక్ సేన్

తెలంగాణ నుంచి టాలీవుడ్ లో గుర్తింపు ఉన్న హీరోల జాబితా తీసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది.ఓ ఐదేళ్ళ క్రితం వరకు నితిన్ పేరు మాత్రమే వినిపించేది.

 Vishwak Sen Ready To Do A Villain Roles-TeluguStop.com

అయితే రేస్ లోకి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ దూసుకొచ్చి స్టార్ హీరోగా అతి తక్కువ టైంలోనే ఎదిగిపోయాడు.ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎలివేట్ అయ్యే పనిలో ఉన్నాడు.

విజయ్ దేవరకొండ తర్వాత అదే స్పీడ్ తో విశ్వక్ సేన్ కూడా తెలంగాణ నుంచి హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు.ఈ నగరానికి ఏమైంది సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ తరువాత ఫలక్ నుమా దాస్, హిట్ సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

 Vishwak Sen Ready To Do A Villain Roles-కథ నచ్చితే విలన్ గా అయినా ఒకే అంటున్న విశ్వక్ సేన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.మరో రెండు సినిమాలని సెట్స్ పైన ఉన్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఓ టాక్ షోలో విశ్వక్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.తనకి ఇగో ఉందని, యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటానని అందుకే ఎవరూ అవకాశం ఇవ్వడం లేదనే రూమర్స్ ఉన్నాయని అందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పుకొచ్చాడు.

తనకి కోపం ఉందని, ఆ కోపంలో చేతిలో ఏ వస్తువు ఉన్న పగలగొట్టేస్తా అని చెప్పాడు.కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని చాలా సార్లు ట్రై చేసిన సాధ్యం కాలేదని అన్నాడు.

ఇక తాను హీరోగానే నటిస్తా అని రూల్ ఏమీ పెట్టుకోలేదని, కంటెంట్ బాగుంటే కొత్త హీరో అయినా సరే విలన్ గా నటించడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు.అయితే కాన్సెప్ట్ నాకు నచ్చితేనే విలన్ గా చేస్తానని అన్నాడు.

మరి విలన్ గా నటించడానికి సిద్ధంగా ఉన్న అతనికి అలాంటి పాత్ర ని ఏ దర్శకుడు అయినా ఆఫర్ చేస్తాడేమో చూడాలి.

#Telngana Hero's #Vishwak Sen #Villain Roles

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు