ఈ సారి లవర్ బాయ్ గా ట్రై చేస్తున్న విశ్వక్ సేన్

ఈ నగరానికి ఏమైంది, పలక్ నమా దాస్, హిట్ సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ ని ఖాతాలో వేసుకొని హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న యువ నటుడు విశ్వక్ సేన్.మొదటి మూడు సినిమాలో పక్కా హైదరాబాదీ మాస్ హీరోయిజం చూపించిన విశ్వక్ తెలంగాణ నుంచి విజయ్ దేవరకొండ తర్వాత ఎక్కువగా యూత్ ఫాలోయింగ్ పెంచుకుంటున్న హీరోగా ఉన్నాడు.

 Vishwak Sen Play Romantic Role In Paagal Movie, Tollywood, Telugu Cinema, Dil Ra-TeluguStop.com

రెగ్యులర్ సినిమాలకి భిన్నంగా కొత్త కథలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించే విశ్వక్ ఇప్పుడు ఓ మలయాళీ హిట్ మూవీ రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకి పాగల్ అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేశారు.ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా రిలీజ్ అయ్యింది.

ఈ పోస్టర్ బట్టి పాగల్ సినిమాలో విశ్వక్ లవర్ బాయ్ గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది.

Telugu @bekkemvenugopal, @luckymediaoff, @naresshlee, @radhanmusic, @svc_officia

నరేష్‌ కుప్పిలి పాగల్ సినిమాతో దర్శకుడు పరిచయం అవుతున్నాడు.మ్యూజికల్‌ లవ్‌స్టోరీగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.హీరో, హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ లవ్ ట్రాక్ ఇంటరెస్టింగ్ గా ఉండబోతుందని బోగట్టా.

ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్ లో నడుస్తుంది.తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో పాటు ఏప్రిల్‌ 30న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు కూడా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ పోస్టర్‌లో విశ్వక్‌ సేన్‌ ‌కూల్‌ లుక్‌లో కనిపిస్తున్నారు.బ్యాక్‌గ్రౌండ్‌లో గులాబిపూలు ప్రేమను, స్వచ్చతను సూచిస్తున్నాయి.

ఇక మాస్ కా దాస్ నుంచి లవర్ బాయ్ గా మారిపోయి విశ్వక్ చేస్తున్న ఈ పాగల్ సినిమా ప్రేక్షకులకి ఎంత వరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube